https://oktelugu.com/

Nandamuri Mokshagna: త్వరలో స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్న నందమూరి మోక్షజ్ఞ…

ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.ఇక ఇప్పుడు ఇదే క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా తన కుమారుడు మోక్షజ్ఞ ను సినిమా ఇండస్ట్రీ లోకి తీసుకోని రావడానికి ప్లాన్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.గతం లో దీని గురించి నందమూరి బాలకృష్ణ ప్రకటించటం జరిగింది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 11, 2024 / 03:06 PM IST

    Nandamuri Mokshagna Guest Role in Balakrishna Akhanda-2 Movie

    Follow us on

    Nandamuri Mokshagna: సినిమా ఇండస్ట్రీలో సినిమా స్టార్ల వారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు చాలా మందే ఉన్నారు.అయితే మిగిలిన రంగాలతో పోల్చుకుంటే ఇలా వారసులుగా ఎంట్రీ ఇవ్వడం సినిమా రంగంలోనే ఎక్కువ అని చెప్పచ్చు.సినిమా ఇండస్ట్రీ ఏదైనా కూడా నటి నటుల పిల్లలు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్లుగా కొనసాగుతున్నారు.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పటి వరకు చాలా మంది స్టార్ హీరో,హీరోయిన్ ల పిల్లలు ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.మరికొంత మంది స్టార్లు తమ పిల్లలను సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమం లోనే నందమూరి బాలకృష్ణ కూడా తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ను టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా దీనికి సంబంధించిన ఒక క్రేజీ అప్ డేట్ సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

    ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.ఇక ఇప్పుడు ఇదే క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా తన కుమారుడు మోక్షజ్ఞ ను సినిమా ఇండస్ట్రీ లోకి తీసుకోని రావడానికి ప్లాన్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.గతం లో దీని గురించి నందమూరి బాలకృష్ణ ప్రకటించటం జరిగింది.ఇక అప్పటి నుంచి నందమూరి అభిమానులు నందమూరి మోక్షజ్ఞ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనే విషయం తెలిసిన తర్వాత ఫలానా దర్శకుడు మోక్షజ్ఞ ను పరిచయం చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చాలా వార్తలు పుట్టుకొచ్చాయి.

    ఈ క్రమం లోనే రాజమౌళి,వి వి వినాయక్,అనిల్ రావిపూడి,పూరి జగన్నాధ్,గోపీచంద్ మలినేని,బోయపాటి శ్రీను ఇలా పలు దర్శకుల పేర్లు వినిపించాయి.కానీ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.అయితే గతం లో చాలా ఏళ్ళ నుంచే మోక్షజ్ఞ సినిమా లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అని వార్తలు వచ్చినప్పటికీ అతని లుక్ మాత్రం అందుకు తగినట్లుగా అనిపించలేదు అని చెప్పచ్చు.దాంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ లేదని కూడా టాక్ వినిపించింది.యాక్టింగ్ గురువు సత్యానంద్ యాంక్టింగ్ స్కూల్ లో మోక్షజ్ఞ ఇప్పుడు యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటున్నాడు.ఫైట్లు,డాన్స్ ల లోను మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.దీనికి తోడు ప్రస్తుతం మోక్షజ్ఞ లుక్ కూడా పూర్తిగా మారిపోయింది అని తెలుస్తుంది.గత కొంత కాలం నుంచి నందమూరి బాలకృష్ణ కుమారుడు మొదటి సినిమా గురించి చాలా వార్తలు సోషల్ మీడియా లో వినిపించాయి.తాజాగా నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా కు సంబంధించి ఒక క్రేజీ వార్త ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో సెన్సేషన్ సృష్టిస్తుంది.

    మోక్షజ్ఞ తన తండ్రి నందమూరి బాలకృష్ణ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు అని ఒక క్రేజీ వార్త నెట్టింట్లో వినిపిస్తుంది.ప్రశాంత్ వర్మ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు అనే వార్త కూడా వినిపిస్తుంది.నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరు ఊహించని ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఒక సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు అని సమాచారం.అయితే నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ హీరో గా రాకపోవడం బ్యాడ్ న్యూస్ అయినా కూడా మోక్షజ్ఞ సినిమాలలో కనిపించటం గుడ్ న్యూస్ అని చెప్పచ్చు.అయితే నందమూరి బాలకృష్ణ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాను చేయబోతున్నారు.ఇక ఈ సినిమాలోనే మోక్షజ్ఞ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు అని సమాచారం.