Best Sell Car: 100 రోజుల్లో లక్ష అమ్మకాలు.. ఏం కారురా బాబు ఇది?

ఈ మధ్య కారు కొనాలనుకునేవారు సన్ రూఫ్ ను కోరుకుంటున్నారు. హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిప్ట్ లో ఇది ప్రధానంగా ఉంది. దీంతో క్రెటా ను ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కారు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

Written By: Chai Muchhata, Updated On : April 17, 2024 12:56 pm

Hyundai Creta facelift

Follow us on

Best Sell Car:  కారు కొనాలని ఆసక్తి పెరిగినప్పుడు కొన్ని కంపెనీలకు వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. ఈ కంపెనీ నుంచి ఏ కొత్త మోడల్ వచ్చినా సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ఈ తరుణంలో కంపెనీలు సైతం వినియోగదారులను ఆకర్షించడానికి లేటేస్ట్ ఫీచర్స్ తో కొత్త కార్లు తీసుకొస్తున్నాయి. ఈ తరుణంలో హ్యాుందాయ్ క్రెటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024లో ఆధునిక ఫీచర్లతో పాటు ఆకట్టుకునే డిజైన్ తో క్రెటా ఫేస్ లిప్ట్ ను ఆవిష్కరించింది. దీంతో ఈ మోడల్ ను ఎక్కువగా లైక్ చేస్తున్నారు. దీంతో 100 రోజుల్లో లక్ష యూనిట్లు అమ్ముడుపోయాయి. మరి ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం..

హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ పెట్రోల్ నేచురల్ పెట్రోల్ కలిగిన ఒక ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇంకొకటి, మరోకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ఇంజిన్ ను కలిగి ఉంది. మరొకటి 7 స్పీడ్ గేర్ బాక్స్ ను సైతం కలిగి ఉంది. ఇందులో ADAS సూట్ తో పాటు అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇది కనెక్ట్ చేసిన ఎల్ ఈడీ, డీఆర్ఎల్ తో కూడిన టెయిల్ టైల్ లేటేస్ట్ ఫీచర్స్ ను కలిగి ఉంది.

ఈ మధ్య కారు కొనాలనుకునేవారు సన్ రూఫ్ ను కోరుకుంటున్నారు. హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిప్ట్ లో ఇది ప్రధానంగా ఉంది. దీంతో క్రెటా ను ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కారు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీనిని ప్రారంభించిన మూడు నెలల్లో అంటే 100 రోజుల్లో లక్ష యూనిట్లు బుకింగ్ చేసుకోవడం విశేషం. ఇదిలా ఉండగా ఈ బుకింగ్ లో 71 శాతం సన్ రూఫ్ ను ఇష్టపడ్డారు. అంతేకాకుండా 52 శాతం బుకింగ్ లు కార్ వేరియంట్ పై లైక్ చేశారు.

2024లో జనవరిలో లాంచ్ చేసిన సందర్భంగా క్రెటా ఫేస్ లిప్ట్ ప్రారంభ ధర రూ.11 లక్షలుగా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ ను రూ.20 లక్షల తో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన క్రెటా కంటే ఫేస్ లిప్ట్ కు వినియోగదారులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీంతో లేటేస్ట్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.