spot_img
Homeబిజినెస్Asus Zenbook Duo UX807 price: రెండు స్క్రీన్లు..భారీ బ్యాటరీ.. ఈ ల్యాప్ టాప్ ధర...

Asus Zenbook Duo UX807 price: రెండు స్క్రీన్లు..భారీ బ్యాటరీ.. ఈ ల్యాప్ టాప్ ధర ఎంతంటే..

Asus Zenbook Duo UX807 price: కొత్తగా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవారికి టెక్నాలజీ దిగ్గజం అసుస్ (Asus) మంచి డివైజ్ లా ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అసుస్ జెన్‌బుక్ డుయో 2026 (Asus Zenbook Duo UX807) డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ విభాగంలోనే అత్యంత ప్రాక్టికల్, పవర్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ఇది సాధారణ ల్యాప్‌టాప్‌లా కనిపిస్తూనే.. అవసరమైనప్పుడు రెండు పూర్తి స్థాయి స్క్రీన్లుగా మారిపోయే ఈ అద్భుతమైన డివైజ్ గురించి పూర్తి వివరాలు మీకోసం..

అసుస్ జెన్‌బుక్ డుయో 2026 డిజైన్ ఎంతో మెరుగైంది. దీని బాడీని సిరామిక్, అల్యూమినియం కలిసిన మెటీరియల్‌తో తయారు చేశారు. దీనివల్ల ల్యాప్‌టాప్‌పై వేలిముద్రలు పడకుండా ఉంటాయి. అలాగే ఇది చూడటానికి చాలా ప్రీమియం లుక్‌తో పాటు గట్టిదనాన్ని ఇస్తుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే దీని సైజును 5 శాతం మేర తగ్గించారు. దీని బరువు దాదాపు 1.65 కేజీలు ఉంటుంది. ఇందులో అమర్చిన సరికొత్త ‘హైడ్‌అవే హింజ్’ వల్ల రెండు స్క్రీన్‌ల మధ్య ఉండే గ్యాప్ చాలా వరకు తగ్గిపోయి రెండు కలిపి ఒకే పెద్ద స్క్రీన్‌లా కనిపిస్తాయి.

ఈ ల్యాప్‌టాప్‌లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దీని రెండు 14 అంగుళాల టచ్ స్క్రీన్లు. ఈ రెండు స్క్రీన్లు కూడా 3K హై రిజల్యూషన్ తో అత్యంత స్మూత్ గా ఉంటాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ చేస్తుండడంతో ఈ డిస్‌ప్లేలు డాల్బీ విజన్ , HDR True Black 1000 సర్టిఫికేషన్‌ కలిగి ఉన్నాయి. 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించే ఇవి క్రియేటర్లు, ఎడిటర్లు, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఈ రెండు స్క్రీన్లు ఒకే నాణ్యతతో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తాయి.

Asus Zenbook Duo UX807ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అయస్కాంతాల సహాయంతో కింద ఉండే రెండవ స్క్రీన్‌కు ‘పోగో పిన్స్’ ద్వారా అతుక్కుంటుంది. కీబోర్డ్‌ను స్క్రీన్ మీద పెట్టినప్పుడు ఇది సాధారణ ల్యాప్‌టాప్‌లా పనిచేస్తుంది ఒకవేళ మనకు రెండు స్క్రీన్లు కావాలనుకుంటే, ఆ కీబోర్డ్‌ను విడదీసి పక్కన పెట్టుకుని బ్లూటూత్ ద్వారా వాడుకోవచ్చు. రెండు స్క్రీన్లు ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ విషయంలో అసుస్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 99 W భారీ బ్యాటరీని అమర్చారు. కేవలం ఒకే స్క్రీన్ వాడుకున్నప్పుడు ఇది దాదాపు 22 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను, రెండు స్క్రీన్లను కలిపి వాడుకున్నప్పుడు కూడా దాదాపు 13 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 100W టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ కు సపోర్టు చేస్తుంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 2,99,990 గా ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version