Samsung Foldable Phone Leak: మొబైల్ వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకునే శామ్‌సంగ్ (Samsung) కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇందులో భాగంగా లేటెస్ట్గా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను తీసుకురానుంది. త్వరలోనే జరగబోయే ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో కంపెనీ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 , జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా జెడ్ ఫ్లిప్ అనే మూడు మోడళ్లను పరిచయం చేయనుంది. అయితే, లాంచ్‌కు ముందే వీటికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్లు ఎలా ఉంటాయంటే?
శాంసంగ్ కంపెనీ నుంచి మార్కెట్లోకి సరికొత్త డిజైన్‌తో బేస్ మోడల్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 రాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన శామ్‌సంగ్ ఫోల్డ్ ఫోన్‌లు మూసి ఉన్నప్పుడు చాలా పొడవుగా, ఇరుగ్గా ఉండేవి. కానీ ఈసారి రాబోయే జెడ్ ఫోల్డ్ 8 మోడల్‌ను శామ్‌సంగ్ ‘వైడ్ డిజైన్’తో కనిపిస్తుంది. 5.4 అంగుళాల లోపలి డిస్‌ప్లేను కలిగి ఉండి.. ఓపెన్ చేసినప్పుడు 7.6 అంగుళాల వరకు పెరుగుతుంది. దీంతో వీడియోలు చూసేవారికి, టైపింగ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది.
అలాగే ప్రీమియం లుక్ కోరుకునేవారికి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా పాత క్లాసిక్ డిజైన్‌ను మరింత మెరుగుపరిచి తీసుకువస్తున్నారు. ఇది 6.5-ఇంచుల భారీ కవర్ డిస్‌ప్లే ఉండి ఓపెన్ చేస్తే 8.0-ఇంచుల అతిపెద్ద మెయిన్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీని అంచులు చాలా సన్నగా ఉంటాయి.. ఇందులో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీఉంటుంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.
స్టైలిష్ లుక్‌తో రానుంది గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8. దీని డిస్‌ప్లేలో శామ్‌సంగ్ కీలక మార్పులు చేసింది. ఈసారి కవర్ స్క్రీన్‌పై కెమెరాల కోసం పొడవాటి సింగిల్ కటౌట్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తంది. అంతేకాకుండా, స్క్రీన్‌ను మడతబెట్టినప్పుడు ముడత కనిపించకుండా ఉండేలా ‘క్రీజ్-ఫ్రీ’ టెక్నాలజీని ఇందులో వాడుతున్నట్లు సమాచారం. ఈ మోడల్ శామ్‌సంగ్ సొంత ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. సరికొత్త షేప్స్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో రాబోతున్న ఈ మూడు ఫోన్‌లు ఫోల్డబుల్ మార్కెట్లో శామ్‌సంగ్ హవాను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

