spot_img
Homeఎంటర్టైన్మెంట్Obsession Hollywood movie box office : అక్షరాలా 2500 కోట్లు.. చిన్న సినిమాగా మొదలై...

Obsession Hollywood movie box office : అక్షరాలా 2500 కోట్లు.. చిన్న సినిమాగా మొదలై ప్రభంజనం సృష్టించిన హాలీవుడ్ చిత్రం..

Obsession Hollywood movie box office : కొన్ని చిన్న సినిమాలు ఎవ్వరూ ఊహించనంత అద్భుతాలను బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తుంటాయి. వందల కోట్ల రూపాయిల ఖర్చు చేసిన తీసిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను నమోదు చేసుకోలేకపోతున్న రోజులివి. అలాంటిది కేవలం 2 నుండి 9 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఒక చిన్న హాలీవుడ్ చిత్రం , ఏకంగా 2500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటే ఆశ్చర్యం వెయ్యక తప్పదు. ఆ సినిమా పేరు ‘అబ్సెషన్’. తెలుగు లో దీని అర్థం పిచ్చి , మోజు , అమిత ప్రేమ వంటివి వస్తాయి. ఒక వ్యక్తిని లేదా వస్తువుని పిచ్చిగా ఇష్టపడడమే దీని అర్థం. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 244 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక్క ఇండియా నుండే ఈ చిత్రానికి 73 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అందులో మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే , ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1 కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, తెలంగాణ ప్రాంతం నుండి 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి 9 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక రాష్ట్రంలో 14 కోట్ల 41 లక్షలు, తమిళనాడు నుండి 7 కోట్ల 56 లక్షలు , కేరళ నుండి 3 కోట్ల 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అయ్యాయి. అలా కేవలం సౌత్ ఇండియా నుండే ఈ చిత్రానికి 34 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక నార్త్ ఇండియా విషయానికి వస్తే ఢిల్లీ నుండి 9 కోట్ల 90 లక్షల రూపాయిలు , ఉత్తర ప్రదేశ్ నుండి 1 కోటి 34 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.

అదే విధంగా పంజాబ్ నుండి 1 కోటి 55 లక్షలు , ఉత్తర్ ఖండ్ నుండి 47 లక్షలు , హర్యానా నుండి 23 లక్షలు , రాజస్థాన్ నుండి 1 కోటి 16 లక్షలు , గుజరాత్ నుండి 2 కోట్ల 43 లక్షలు , మహారాష్ట్ర నుండి 15 కోట్ల 30 లక్షలు , గోవా నుండి 55 లక్షలు, మధ్య ప్రదేశ్ నుండి 1 కోటి 16 లక్షలు , ఛత్తీస్ ఘర్ నుండి 52 లక్షలు , వెస్ట్ బెంగాల్ నుండి 1 కోటి 82 లక్షలు , బీహార్ + ఝార్ఖండ్ నుండి 58 లక్షలు , ఒడిశా నుండి 75 లక్షలు , అస్సాం నుండి 46 లక్షలు , మిగిలిన రాష్ట్రాల నుండి 39 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా 9 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం గ్లోబల్ వైడ్ గా 2500 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper
Exit mobile version