Best Phones: ఒకప్పుడు ఏదైనా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించడానికి విపరీతంగా ప్రమోట్ చేసుకునేవారు. సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకొని.. తమ కంపెనీలకు అనుకూలంగా ప్రచారం చేసుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. సోషల్ మీడియా కాలంలో ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులతోనే ప్రచారం చేసుకుంటున్నారు. తమ ఉత్పత్తులను వాడిన తర్వాత వారి అనుభవాన్ని సేకరిస్తున్నారు.. యూజర్ల అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తద్వారా ఉత్పత్తులకు విభిన్నమైన మార్కెటింగ్ చేసుకుంటున్నారు.
Samsung galaxy z tryfold
Samsung galaxy z tryfold ధర ఇండియన్ మార్కెట్లో 2.2 లక్షలకు లభిస్తుంది. ఇది డి ఈ ఎక్స్ ఇంటర్ పేస్ ను కలిగి ఉంటుంది. ఒకేసారి 5 యాప్ లు ఉపయోగించే అవకాశం ఉంటుంది. 39 గ్రాముల బరువుతో ఎద్దు లభిస్తుంది. దీనిని మడతపెట్టి జేబులో లేదా పర్సులో పెట్టుకోవచ్చు. ఇది చూసేందుకు గంభీరమైన రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫోన్ గురించి షెల్డెన్ పింటో అనే వ్యక్తి అద్భుతంగా వర్ణించారు. ఆయన ఈ ఫోన్ వాడుతూ.. తన జీవితకాల ఆశయం నెరవేరిందని పేర్కొన్నారు.
Oneplus 13 s
వన్ ప్లస్ 13 ఎస్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ఉంది. ఇది భారీ గేమ్ లు, మల్టీ టాస్కింగ్ కు ఉపయోగపడుతుంది. 6.3 టు అంగుళాల ఓఎల్ఈడి పానెల్, పొడవైన స్క్రీన్ దీనికి ప్రధాన ఆకర్షణ. 2ఎక్స్ టెలిఫోటో.. అల్ట్రా వైడ్ కెమెరా.. ఈ ఫోన్ కు ఉన్న ప్రధాన ఆకర్షణలని డేలిమా తన అనుభవాన్ని పంచుకున్నారు.
Apple MacBook Air M4
Apple MacBook Air M4 లో ఎం 4 చిప్ ఉంటుంది. తేలికగా.. ఉండే ఈ పరికరం సృజనాత్మకమైన పనులు చేసే వారికి అద్భుతమైన ఎంపిక. ఇందులో బ్యాటరీ కూడా ఎక్కువగా కాలం పనిచేస్తుంది. డిస్ప్లే అత్యంత పారదర్శకంగా ఉంది. రోజువారి పనులు చేసే వారికి.. కార్పొరేట్ సంస్థలలో ఎక్కువ విధులు చేపట్టే వారికి ఇది ఎంతో ఉపయుక్తమని హర్ ప్రీత్ సింగ్ అనే భారతీయుడు తన అనుభవాన్ని పంచుకున్నారు.
Nintendo switch 2
Nintendo switch 2 మోడల్ దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తుంది. ఇందులో బ్లాక్ గ్లాస్ స్లాబ్ అందుబాటులో ఉంటుంది. గేమింగ్ విషయంలో ఇది అద్భుతమైన ఎంపిక. AAA గేమ్ లు ప్రయత్నించేవారికి ఇది అద్భుతమైన గాడ్జెట్. ఇప్పటికే పది మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది ఈ సాంకేతిక కాలానికి అద్భుతమైన పరికరమని మనస్ మితుల్ అనే వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.
iPhone 17
iPhone 17 లో 120 హెచ్ జెడ్ ప్రమోషన్ డిస్ప్లే.. అన్నిటికంటే ముఖ్యంగా ప్రో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బేస్ వేరియంట్ లో 18 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. వీడియోలు, ఫోటోలు తీయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని ధృవ్ అనే వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా, ఎయిర్ పాడ్స్ ప్రో 3, Google pixel buds 2 a, Samsung galaxy s25 edge, Sony WH 1000 xm6 వంటి మోడల్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ప్రాచుర్యాన్ని పొందాయి.