Best Mileage Cars: కార్లు కొనాలనుకునే వారు ముఖ్యంగా మైలేజీ ఎంత ఇస్తుంది? అని చూస్తారు. ఎందుకంటే కొందరు లాంగ్ డ్రైవ్ కోసమే కార్లను వినియోగిస్తుంటారు. వినియోగదారులకు అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మైలేజీని దృష్టిలో పెట్టుకొని కొర్లను తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా Sports Utility Vehicles (SUV)లను మైలేజీ ఎక్కువ ఇచ్చే విధంగా తయారు చేస్తున్నాయి. ఇటీవల చాలా మంది వినియోగదారులు సైతం ఎస్ యూవీలపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ తరుణంలో కొన్నిమోడళ్లు మార్కెట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. మైలేజీకి మొగుడిలా రోడ్లపై దూసుకుపోతూ ఆకట్టుకుంటున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా..
వోక్స్ వ్యాగన్ టైగన్:
Woks Wagan నుంచి రిలీజ్ అయినా టైగన్ వెరీ ఇంప్రెస్డ్ గా ఉంది. 1.5 లీటర్, 4 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్, ఐడిల్ స్టార్ట్ ఫంక్షన్ ను కలిగిన ఈ ఎస్ యూవీ మిగతా ఫీచర్లు కూడా తెగ ఆకట్టుకుంటున్నాయి. దీని ధర రూ.11.61 లక్షలు ఉంది. ఈ కారు ఇచ్చే మైలేజీ లీటర్ కు 18.81.కిలోమీటర్లు.
Scoda కుషాక్:
వోక్స్ వ్యాగన్ ఫీచర్లను కలిగిన వోక్స్ వ్యాగన్ 1.5 లీటర్, 4 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. స్కోడా కార్లను ఇష్టపడేవారు దానిని బాగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కారు ధర రూ.11.59 లక్షలతో విక్రయిస్తున్నాయి. ఇక ఈ మోడల్ ఇచ్చే మైలేజీ లీటర్ కు 17.83 కిలో మీటర్లు.
కియా సెల్టోస్:
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా భారత్ లో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ కంపెనీ రిలీజ్ చేసిన సెల్టోస్ ఇప్పటికే విపరీతంగా అమ్మకాలు జరుపుకుంది. ఇందులో కొత్త ఫీచర్లతో మరో మోడల్ వచ్చింది. ఇది ఎక్కువ ఇంజన్ ఆప్షన్లతో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. దీని ధ రూ.10.89 లక్షలు ఉంది. ఇదిచ్చే మైలేజీ లీటర్ కు 17.8 కిలోమీటర్లు.
Hundai క్రెటా:
హ్యుండాయ్ కంపెనికి చెందిన క్రెటా బెస్ట్ కార్లలో ఒకటిగా నిలిచింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 4 సిలిండర్లను కలిగి ఉంది. ట్రాన్స్ మిషన్ కోసం 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. కియా సెల్టోస్ ధర రూ.10.87 లక్షలు. ఈ మోడల్ లీటర్ కు 16.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.