UP Farmer: సాధారణంగా దుక్కి టెద్దులుకానీ… దున్నపోతులు కానీ రైతుకు ఎంతో అలవాటు పడతాయి. రైతు చెప్పిన విధంగా నడుచుకుంటాయి. రైతు వద్ద క్రమశిక్షణగా మెలుగుతాయి. కానీ ఓ ఎద్దు రైతుకే ఎదురు తిరిగింది. ఏకంగా పగబట్టింది. మట్టు పెట్టడానికి ప్రయత్నించింది. చివరికి ప్రాణాలు కాపాడుకునేందుకు సదరు రైతు చిట్టెక్కాల్సి వచ్చింది. అయినా సరే ఆ ఎద్దు వెనక్కి తగ్గలేదు. చెట్టు కింద రెండు గంటల పాటు నిరీక్షించింది. అటు ఇటు కలియతిరిగింది. రైతు దిక్కు చూసి రంకెలు వేసింది. ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో ఓ ఎద్దు దారి తప్పింది. గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తోంది. ఎద్దు దాడిలో దాదాపు 12 మంది గాయపడ్డారు. ఇలా దారి తప్పిన ఎద్దు కకనూ అనే రైతు కంటపడింది. వెంటపడి వెంబడించింది. దీంతో పరుగులు తీసిన సమీపంలోని ఓ చెట్టు ఎక్కాడు. అయినా సరే ఆ ఎద్దు విడిచిపెట్టలేదు. చెట్టు కిందే నిరీక్షించింది. రెండు గంటలపాటు పగ పట్టిన దానిలా కదిలితే బెదిరిస్తూ అలానే ఉండిపోయింది. అయితే ఈ దృశ్యాలను ఓ అపరిచిత వ్యక్తి సెల్ ఫోన్ లో బంధించాడు. సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
దీనిపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఇటువంటి ఎద్దులను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ దారి తప్పిన ఎద్దును పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందం ప్రయత్నాలను ప్రారంభించింది.
बलिया में आवारा सांड से जान बचाने के लिए एक किसान करीब 2 घंटे तक पेड़ पर बैठा रहा, वीडियो वायरल होने के बाद डीएम ने संज्ञान लिया!!#Ballia #UttarPradesh pic.twitter.com/5LpQqUNHnW
— Gaurav Dixit (@GauravKSD) July 28, 2023