Homeబిజినెస్Best Electric Scooters Under 45000: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా.. రూ. 45 వేల లోపు...

Best Electric Scooters Under 45000: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా.. రూ. 45 వేల లోపు లభించే మోడల్స్ ఇవే..

Best Electric Scooters Under 45000: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ ఆఫీస్ లేదా కాలేజీ ప్రయాణాలు చేసేవారు బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఈ-స్కూటర్ల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు తక్కవ ధరకే ఈ స్కూటర్లను అందించేందుకు సిద్ధంగాఉన్నాయి. ముఖ్యంగా రూ. 45 వేల బడ్జెట్ పరిమితిలో కొన్ని కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. ఆ కంపెనీలు ఏవో చూద్దాం..

కొమాకి ఎక్స్-వన్ :
ఈ బడ్జెట్‌లో గ్రాఫేన్ (Graphene) బ్యాటరీ టెక్నాలజీతో వస్తున్న పాపులర్ మోడల్ ఇది. దీనికి యాంటీ-థెఫ్ట్ అలారం , ఎల్‌ఈడీ లైటింగ్ , మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. కాలేజీ విద్యార్థులకు, ఇళ్లకు దగ్గర్లోని మార్కెట్ పనులకు ఇది చాలా చక్కగా సరిపోతుంది. దీని ధర: సుమారు రూ. 35,000 – రూ. 38,000 (ఎక్స్-షోరూమ్). ఒకసారి ఛార్జ్ చేస్తే 60 నుండి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

యాకుజా రూబీ / న్యూ :
స్టైలిష్ తో పాటు లేటేస్ట్ డిజైన్‌ కోరుకునేవారికి ఈ స్కూటర్ బెస్ట్ ఎంపిక. ఇది చూసేందుకు కాంపాక్ట్‌గా ఉంటుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల మహిళలు, వృద్ధులు సిటీ ట్రాఫిక్‌లో చాలా సులువుగా నడపడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీని ఛార్జింగ్ సమయం 6 నుండి 8 గంటలు పడుతుంది. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 55 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లొచ్చు. దీనిని రూ. 38,000 (ఎక్స్-షోరూమ్) నుంచి విక్రయిస్తున్నారు.

ఉజాస్ ఈగో ఎల్ఏ:
తక్కువ ధరలో ఎక్కువ కాలంగా మార్కెట్లో నమ్మకంగా ఉన్న మోడల్ ఇది. ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లు, డిజిటల్ స్పీడోమీటర్ , అల్లాయ్ వీల్స్ వస్తాయి. దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. దీని ధర రూ. 35,000 – రూ. 40,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 నుండి 75 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు.

జెలియో ఈవా ఎకో ఎల్ఎక్స్:
రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇందులో సెంటర్ లాకింగ్ సిస్టమ్, కీ-లెస్ డ్రైవ్, యూఎస్‌బీ పోర్ట్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేయడం ద్వారా 60 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 43,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

అయితే రూ. 45 వేల లోపు లభించే స్కూటర్లలో ఎక్కువ శాతం లెడ్-యాసిడ్ (Lead-Acid) బ్యాటరీలు ఉంటాయి. వీటికి కంపెనీలు సాధారణంగా 1 సంవత్సరం వారంటీ మాత్రమే ఇస్తాయి. ఒకవేళ మీ బడ్జెట్‌ను పెంచుకుంటే మరింత ఎక్కువ కాలం మన్నిక వచ్చే లిథియం-అయాన్ బ్యాటరీ స్కూటర్లు లభిస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular