https://oktelugu.com/

బ్రేకింగ్: పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు జరుగుతాయా? జరగవా? అన్న ఉత్కంఠ నడుమ హైకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఏపీలో ఎన్నికలను యథాతథంగా నిర్వహించవచ్చని హైకోర్టు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. నిన్ననే ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2021 3:27 pm
    Follow us on

    ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు జరుగుతాయా? జరగవా? అన్న ఉత్కంఠ నడుమ హైకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది.

    ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

    ఏపీలో ఎన్నికలను యథాతథంగా నిర్వహించవచ్చని హైకోర్టు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది.

    నిన్ననే ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జీ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.ఈ.సీ ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే విధించారు.. తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని ఆక్షేపించింది.

    ఏపీలో పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 8వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి ఏపీ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయినా కూడా హైకోర్టు ఎన్నికలను నిలిపివేయడం సంచలనమైంది. ఈనెల 15న ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

    రేపే ఎన్నికలు అనగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు ఏపీ సర్కార్ కు షాకింగ్ గా మారాయి.. ప్రభుత్వం దీనిపై  హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లగా రేపు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.