CM Chandrababu Own House in Amaravati
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లు అవుతోంది. విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. 2019లో మాత్రం ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇంతవరకు ఆయనకు ఏపీలో సొంత ఇల్లు లేదు. అందుకే అమరావతిలో ఓ 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇంటి నిర్మాణానికి నిర్ణయించారు చంద్రబాబు. ఏప్రిల్ 9న తన కొత్త ఇంటికి భూమి పూజ చేయనున్నారు. మరి కొన్ని రోజుల్లో సీఎం సొంత ఇల్లు అందుబాటులోకి రానుంది. అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదగా ప్రారంభం కానుండగా.. చంద్రబాబు ఇంటి నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు.
Also Read : పవన్, బాలయ్యలపై మనసులో మాటను బయటపెట్టిన చంద్రబాబు!
* 5 ఎకరాల ప్రాంగణంలో..
గత ఏడాది ఆఖరిలో ఇంటి నిర్మాణం కోసం అమరావతిలో( Amaravathi ) ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు చంద్రబాబు. ఈ స్థలం వి6 రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. గవర్నమెంట్ కాంప్లెక్స్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మేరకు ఇంటి నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇంటితోపాటు గార్డెన్, భద్రతా సిబ్బంది గదులు, వాహనాల పార్కింగ్ కోసం స్థలం కేటాయిస్తారు. వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. మంత్రి లోకేష్ కార్యాలయ సిబ్బంది, వాస్తు నిపుణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని నెలాఖరులో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఈ ప్లాట్ గుండా వెళ్తున్న విద్యుత్ స్తంభాలను కూడా మార్చుతారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా అమరావతిగా మారనుంది.
* ఇప్పటివరకు కరకట్టపై ఉన్న ఇంటిలో..
ఇప్పటివరకు ఉండవల్లి లో( undavalli ) కరకట్ట పై ఉన్న నివాసంలో ఉంటున్నారు చంద్రబాబు. అది పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు చెందినది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నివాసం పై ఎంతో వివాదం జరిగింది. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించింది అని అభియోగం మోపింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. పక్కనే ఉన్న ప్రజావేదికను కూల్చేసింది. చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేందుకు అప్పట్లో సిద్ధపడ్డారు. అయితే ఇంతలో యజమాని లింగమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఇచ్చింది. అప్పట్లో విపక్ష నేత అధికారిక నివాసముగా గుర్తించాలని కోరిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేత అధికారిక నివాసంగా గుర్తింపు వచ్చింది.
* త్వరగా నిర్మాణం చేపట్టాలని..
అయితే అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరపాలని చంద్రబాబు( Chandrababu) భావిస్తున్నారు. అదే సమయంలో అమరావతిలో సొంత ఇంటి నిర్మాణం చేపడితే మంచి సంకేతాలు వెళ్తాయని భావించారు. అందుకే ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇంటి నిర్మాణానికి సిద్ధపడ్డారు. వీలైనంత త్వరలో ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
Also Read : ఇది లోకేష్ గిఫ్ట్.. స్టూడెంట్స్ కు ఇక పై ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’