Homeబిజినెస్Bajaj : రూ.20,000 తక్కువ.. 155కిమీ రేంజ్.. బజాజ్ కొత్త చేతక్ అదుర్స్!

Bajaj : రూ.20,000 తక్కువ.. 155కిమీ రేంజ్.. బజాజ్ కొత్త చేతక్ అదుర్స్!

Bajaj  :దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో బజాజ్ తనదైన ముద్రవేస్తోంది. తాజాగా కంపెనీ తన అత్యంత పాపులర్ బైక్ చేతక్ సిరీస్ లో సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. ‘చేతక్ 3503’ పేరుతో వచ్చిన ఈ స్కూటర్ మునుపటి మోడళ్ల కంటే దాదాపు రూ.20,000 వరకు తక్కువ ధరలో లభిస్తుండటం విశేషం. అంతేకాదు, దీని రేంజ్ కూడా ఏకంగా 155 కిలోమీటర్లకు పెరగడం మరో విశేషం. ఎక్కువ మంది వినియోగదారులకు చేతక్ బ్రాండ్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో బజాజ్ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read : ఆడి ఏ6.. లగ్జరీ, టెక్నాలజీల అద్భుత కలయిక.. కానీ ధర తెలిస్తే షాక్!

కొత్త చేతక్ 3503లో ప్రత్యేకతలు ఏమిటి?
ధరను తగ్గించే క్రమంలో బజాజ్ ఈ కొత్త మోడల్‌లో కొన్ని ఫీచర్లను తగ్గించింది. ఇందులో సాధారణ బ్లూటూత్ క్లస్టర్‌ను అందించారు. ఇతర వేరియంట్లలో ఉండే ఫుల్ డిజిటల్ లేదా స్మార్ట్ కనెక్టెడ్ డిస్‌ప్లేకు బదులుగా సింపుల్ బ్లూటూత్ క్లస్టర్‌ను అమర్చారు. అలాగే, ఈ వేరియంట్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇక మిగతా వేరియంట్లలో కనిపించే సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు ఇందులో ఉండవు.

పర్పామెన్స్ ఎలా ఉందంటే
బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే, ఇతర చేతక్ వేరియంట్లో ఉన్న అదే బ్యాటరీని ఇందుటోనూ అందజేశారు. దీని హయ్యెస్ట్ స్పీడు గంటకు 63 కిలోమీటర్లు. అయితే, రేంజ్ విషయంలో మాత్రం గుడ్ న్యూస్ చెప్పాల్సిందే. ఈ కొత్త మోడల్ ఒకసారి ఛార్జ్ చేస్తే 155 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది ఇతర వేరియంట్ల కంటే కొంచెం ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. అంటే, టాప్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం వెళ్లవచ్చు.

కలర్ ఆప్షన్స్
కొత్త చేతక్ 3503 నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, మ్యాట్ గ్రే వంటి కలర్ ఆప్షన్ యువతను, నగరాల్లో ప్రయాణించే వారిని బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి రంగులోనూ స్కూటర్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

బుకింగ్, డెలివరీ:
బజాజ్ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు మే మొదటి వారం నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్టైలిష్, బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే కొత్త బజాజ్ చేతక్ 3503 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version