Uttar Pradesh : కానీ ఈ కథనంలో 50 ఏళ్ల మహిళ.. కనివిని ఎరగని స్థాయిలో దారుణానికి పాల్పడింది. సినిమాకు మించిన ట్విస్టులతో బుర్రను హీటెక్కించింది.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన సంచలనాన్ని సృష్టించింది. అంబేద్కర్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ జిల్లాకు చెందిన ఇంద్రావతి అనే మహిళకు భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. అయితే ఇందులో ఆమె తనకు మనవడి వరసైన ఆజాద్ అనే యువకుడిని ఆలయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది.. ఆజాద్ – ఇంద్రావతి ముందుగా గోవింద్ సాహిబ్ గుడికి వెళ్లారు. అక్కడ నుదుటికి బొట్టు పెట్టుకున్నారు. అగ్నిహోత్రం చుట్టూ ఒకరి చేతిని మరొకటి పట్టుకుని ఏడు అడుగులు వేశారు. ఆ తర్వాత గ్రామము నుంచి వెళ్ళిపోయారు. ఇంద్రావతి, ఆజాద్ ఓకే ప్రాంతంలో నివసించడం వల్లే.. వారి మధ్య ఉన్న బంధుత్వం కాస్త ఈ సంబంధానికి దారి తీస్తుందని స్థానికులు అంటున్నారు. మొదట్లో ఇద్దరు బంధువుల లాగానే మెదిలే వారని.. ఆ తర్వాత వారి మధ్య క్రమంగా ప్రేమ మొదలైందని స్థానికులు చెబుతున్నారు. ప్రేమ పుట్టిన తర్వాత వారిద్దరు తరచుగా కలుసుకునేవారని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ వరుసతో బంధువులు కావడంతో.. కుటుంబ సభ్యులు కూడా పెద్దగా అనుమానించేవారు కాదు. అయితే ఇంద్రావతి, ఆజాద్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని సరిగ్గా నాలుగు రోజుల క్రితమే ప్లాన్ వేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు అత్యంత రహస్యంగా మాట్లాడుకుంటూ ఉండగా.. ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాగుతున్న సంబంధం గురించి తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇలాంటి సంబంధం మంచిది కాదని.. దూరంగా ఉండటం ఉత్తమం అని ఇంద్రావతికి చంద్రశేఖర్ చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. భార్య తీరు సరిగ్గా లేకపోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఆజాద్ – ఇంద్రావతి వ్యవహారం తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరు మేజర్లు కావడంతో ఫిర్యాదు స్వీకరించడానికి వారు ఒప్పుకోలేదు.
Also Read : పాకిస్తాన్ కు లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. ఇంతకీ ఎవరీ గ్యాంగ్?
చంపేందుకు ప్రయత్నించింది
చంద్రశేఖర్ తన వ్యవహారానికి అడ్డుగా ఉండడంతో ఇంద్రావతి దారుణమైన ప్లాన్ రూపొందించింది. భర్త, పిల్లలకు విషాన్ని ఇచ్చి చంపడానికి వెనుకాడ లేదు.. అయితే ఈ విషయం పసిగట్టిన చంద్రశేఖర్.. ఇంద్రావతిని నిలదీశాడు. దీంతో ఆమె లేనిపోని మాటలు చెప్పి.. అతడిని బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే చంద్రశేఖర్ కు ఇంద్రావతి రెండో భార్య కావడం విశేషం. చంద్రశేఖర్ వృత్తి రీత్యా తరచూ క్యాంపులకు వెళ్లేవాడు. దీనిని అదునుగా చేసుకున్న ఇంద్రావతి ఆజాద్ తో మరింత దగ్గరయింది.. అంతేకాదు ఏకంగా ఇంద్రావతి ఆజాద్ ను వివాహం చేసుకుంది. ఇక భార్య ఆజాద్ ను వివాహం చేసుకోవడంతో చంద్రశేఖర్ తట్టుకోలేకపోయాడు. హిందూ సంస్కృతి ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే 13వ రోజు పెద్ద కర్మ నిర్వహిస్తారు. చంద్రశేఖర్ కూడా తన భార్య ఇంద్రావతి పేరు మీద పెద్దకర్మ నిర్వహించాలని నిర్ణయించాడు. ఈ విషయం బంధువులకు తెలియడంతో చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన పరువు మొత్తం పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నాడు.