Audi A6: లగ్జరీ కార్లంటే మీకు ఇష్టమా.. లేటెస్ట్ ఫీచర్లతో కూడిన సెడాన్ కోసం చూస్తున్నారా ? అయితే ఆడి ఏ6 అందిస్తోంది స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ ఇంజన్, హైటెక్ ఫీచర్లు.. ఒక్క లుక్కులోనే మీరు ఇది అంటే ఇష్టపడడం ఖాయం. మరి దీని ఫీచర్స్, ధర ఏంటో ఈ కథనంలో చూద్దాం. ఎగ్జిక్యూటివ్ సెడాన్ల ప్రపంచంలో ఆడి ఏ6 తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ, అద్భుతమైన పర్ఫామెన్స్, అట్రాక్టీవ్ డిజైన్ తో ఇది తన పోటీదారులకు గట్టి సవాలు విసురుతోంది. ఆడి ఏ6 ప్రధానంగా రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ప్రీమియం ప్లస్, టెక్నాలజీ. దీని ప్రారంభ ధర రూ.65,72,000 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఆడి ఏ6ని ఒక అద్భుతమైన ఆప్షన్ గా ఎందుకు పరిగణిస్తున్నారో తెలుసా ? అందుకు ఐదు కారణాలున్నాయి.
Also Read : టాప్ స్పీడ్ 343కిమీ.. ఇది కారా ? ఫైటర్ జెట్టా.. ఇండియాలో లాంచ్
1. డిజైన్, రోడ్డుపై ప్రత్యేక గుర్తింపు:
ఆడి ఏ6 డిజైన్ చాలా ఆకర్షణీయంగాఉంటుంది. దాని సిగ్నేచర్ సింగిల్‌ఫ్రేమ్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు రోడ్డుపై దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగిస్తాయి. దీని స్ట్రాంగ్ ప్రెజెన్స్ మొదటి చూపులోనే ప్రత్యేకంగా నిలబెడుతుంది.
2. లగ్జరీ , టెక్నాలజీ అద్భుత కలయిక:
ఆడి ఏ6 ఇంటీరియర్ అధునాతన లగ్జరీకి ఒక చక్కటి ఉదాహరణ. నాణ్యమైన మెటీరియల్, అద్భుతమైన పర్ఫామెన్స్, ఆకట్టుకునే డిజైన్ కలిసి దీని లోపలి భాగానికి ఒక అద్భుతమైన రూపాన్నిస్తాయి. డ్యూయల్ టచ్‌స్క్రీన్ ఎంఎంఐ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఆడి వర్చువల్ కాక్‌పిట్ ఒక డిజిటల్ డిస్‌ప్లేను అందిస్తుంది, దీనిని మీ అవసరం, అభిరుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. తద్వారా అవసరమైన డ్రైవింగ్ సమాచారం ఎల్లప్పుడూ మీ దృష్టిలో ఉంటుంది.
3. పవర్ ఫుల్ ఇంజన్, అద్భుతమైన మైలేజ్:
ఆడి ఏ6లో అందించిన 2.0-లీటర్ టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్ అద్భుతమైన పర్ఫామెన్స్, బెస్ట్ మైలేజ్ అందిస్తుంది. ఈ ఇంజన్ చాలా వేగవంతమైనది. దీని వలన కారు త్వరగా స్పీడ్ అందుకుంటుంది. అలాగే దీని అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ పట్టణాల్లోని రద్దీ రహదారులు లేదా హైవేల్లో దూర ప్రయాణాలు అయినా ప్రతి పరిస్థితిలో చాలా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అందిస్తాయి.
4. అధునాతన డ్రైవర్ అసిస్ట్ టెక్నాలజీ:
ఆడి ఏ6లో అనేక అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ను సురక్షితంగా చేస్తాయి. ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్ , పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి వివిధ పరిస్థితులలో డ్రైవర్‌కు చురుకుగా సహాయపడతాయి. ఈ టెక్నాలజీల కారణంగా డ్రైవర్ విశ్వాసం పెరుగుతుంది. సుదీర్ఘ ప్రయాణాలు కూడా సులభం అవుతాయి.
5. ప్రతి ప్రయాణీకుడికి సౌకర్యం:
ఆడి ఏ6ని డ్రైవర్, ప్రయాణీకులందరూ ప్రతి ప్రయాణంలోనూ అత్యుత్తమ సౌకర్యాన్ని అనుభవించేలా రూపొందించారు. దీని విశాలమైన కేబిన్ తగినంత లెగ్‌రూమ్‌ను అందిస్తుంది. అధునాతన క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రతి వాతావరణంలోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.