https://oktelugu.com/

AZAD ENGINEERING SHARE: రోల్స్ రాయిస్ యుద్ధ విమానాల ఇంజిన్లకు మన హైదరాబాదీ కంపెనీ.. ఒక్క రోజుతో పెరిగిన షేర్లు..

ప్రస్తుతం కేవలం ఒక్క కారణంతో ఒక స్టాక్ మంగళవారం సెషన్ లో ఏకంగా 20 శాతం పెరగడం విశేషం. ముందు ఇంట్రాడేలో ఈ షేరు 10శాతం పుంజుకుంది. అదే ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటిడ్.

Written By: Swathi Chilukuri, Updated On : January 30, 2024 5:55 pm
AZAD ENGINEERING SHARE
Follow us on

AZAD ENGINEERING SHARE: స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలంటే చాలా మంది భయపడుతుంటారు. కానీ డబ్బులు సంపాదించడం కోసం కొందరు రిస్క్ కూడా చేస్తుంటారు. మరి మీరు కూడా ఇలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారా? ఇంతకీ ఏ స్టాక్స్ ను ఎంచుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్టు పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. మార్కెట్లపై స్పష్టమైన అవగానతో పెట్టుబడులు పెట్టడం మంచిది. అప్పుడే రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు కంపెనీల పనితీరు, ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు అన్నింటిని కూడా పరిశీలించాలి.

ప్రస్తుతం కేవలం ఒక్క కారణంతో ఒక స్టాక్ మంగళవారం సెషన్ లో ఏకంగా 20 శాతం పెరగడం విశేషం. ముందు ఇంట్రాడేలో ఈ షేరు 10శాతం పుంజుకుంది. అదే ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటిడ్. ఈ స్టాక్ ఇవాళ ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల నుంచి మద్దతు ఉండడంతో 20శాతం పెరిగింది. దీంతో షేర్ విలువ రూ. 854.30 వద్ద స్థిరపడింది. ఇదిఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర. కనిష్టంగా రూ. 642 గా ఉంది. అయితే కేవలం ఇవాళ ఒక్క రోజే షేరుపై రూ. 142.35 పెరగడం విశేషం.

ఆజాద్ ఇంజనీరింగ్ షేర్ కిందటి సెషన్ లో కూడా ఒక దశలో 10 శాతం వరకు పెరిగి చివరకు 5 శాతం లాభంతో సెషన్ ను ముగించుకుంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ. 5.05వేల కోట్లుగా ఉంది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, షట్లర్ పీవి సింధు వంటి వారు కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇది హైదరాబాద్ కంపెనీనే. కానీ తాజాగా పెద్ద డీల్ ను కుదుర్చుకుంది. అదీ బ్రిటన్ కు చెందిన రోల్స్ రాయిస్ తోనే ఒప్పందం ఫిక్స్ చేసుకుంది కంపెనీ.

రోల్స్ రాయిస్ యుద్ధ విమానాల ఇంజిన్లకు విడిభాగాలు సరఫరా చేయనుంది ఆజాద్ కంపెనీ. దీని కోసం ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. భారత్ లో తమకు అవసరమైన విడిభాగాల తయారీ, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ డీల్ కుదుర్చుకున్నట్లు రోల్స్ రాయిస్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు అలెక్స్ జినో పేర్కొన్నారు.