Audi Q7 : లగ్జరీ కార్ల తయారీదారు అయిన ఆడి తన సరికొత్త క్యూ7 ఎస్‌యూవీని భారతీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ కారు ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.88.70 లక్షలు. ఈ పవర్ ఫుల్ ఎస్‌యూవీ 3.0 లీటర్ వి6 టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 340 హార్స్‌పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 48వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది.
ఇండియాలో ఇప్పటికే 10,000 యూనిట్లకు పైగా అమ్ముడైన ఆడి క్యూ7 సరికొత్త మోడల్ ఇప్పుడు కస్టమర్ల దృష్టిని మరింతగా ఆకర్షిస్తోంది. కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అంఅందుకుంటుంది. ఈ కారు గరిష్టంగా గంటకు 250 కిమీ స్పీడుతో దూసుకుపోతుంది. ఇది క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, 7 డ్రైవ్ మోడ్స్‌తో వస్తుంది. ఇది వివిధ రహదారి పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కలిగిస్తుంది.
Also Read : ఆడి ఏ6.. లగ్జరీ, టెక్నాలజీల అద్భుత కలయిక.. కానీ ధర తెలిస్తే షాక్!
కొత్త క్యూ7 మరింత బోల్డ్, ఎట్రాక్టివ్ లుక్ అందుకుంది. ఇందులో కొత్త సింగిల్ ఫ్రేమ్ గ్రిల్, నిలువు డ్రాప్‌లెట్ ఇన్లే డిజైన్, కొత్త ఎయిర్ ఇన్‌టేక్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బంపర్, ఎగ్జాస్ట్ ట్రిమ్స్‌తో కూడిన డిఫ్యూజర్ దీనికి మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. ఈ ఎస్‌యూవీ 5 ట్విన్-స్పోక్ ఆర్20 అల్లాయ్ వీల్స్, 5కలర్స్ (సాఖిర్ గోల్డ్, వెటోమో బ్లూ, మిథోస్ బ్లాక్, సమురాయ్ గ్రే , గ్లేసియర్ వైట్) ఆప్షన్లతో లభిస్తుంది.
క్యూ7 ఇంటీరియర్ అత్యంత ప్రీమియంగా ఉంటుంది. ఇందులో సీడర్ బ్రౌన్, సైగా బేజ్ అప్హోల్స్ట్రీ, బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ 3డి సౌండ్ సిస్టమ్ (19 స్పీకర్లు, 730 వాట్స్), ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్ ఉన్నాయి. ఎంఎంఐ నావిగేషన్ ప్లస్‌తో టచ్ రెస్పాన్స్ ఫీచర్ కూడా అందిస్తోంది కంపెనీ. ఇది 7-సీట్ల ఎస్‌యూవీ, మూడవ వరుస సీట్లను ఎలక్ట్రికల్‌గా ఫోల్డ్ చేయవచ్చు.ఇది ఎక్కువ లగేజ్ స్పేస్‌ను అందిస్తుంది.
సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే లేన్ డిపార్చర్ వార్నింగ్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఈ ఫీచర్లు కారు స్టెబిలీటీ, ప్రయాణికుల సేఫ్టీకి పెద్ద పీట వేసింది. ఆడి క్యూ7తో రెండు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఇందులో 10 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంది. వినియోగదారులు దీనిని ఏడు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. దీనితో పాటు 7 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. స్టైల్, పర్ఫామెన్స్, టెక్నాలజీ, సేఫ్టీ అన్నీ ఒకే కారులో కోరుకునే వారికి కొత్త ఆడి క్యూ7 బెస్ట్ ఆప్షన్.
Also Read : టాప్ స్పీడ్ 343కిమీ.. ఇది కారా ? ఫైటర్ జెట్టా.. ఇండియాలో లాంచ్