Jagan: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) దూకుడుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సింహాచలంలో గోడ కూలిన ఘటనలు 8 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలు చేశారు. ఇంకోవైపు ఈరోజు తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూనే కూటమి ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి.
Also Read: అమరావతిలో ప్రధాని సభకు జగన్.. కీలక నిర్ణయం!
* బలవంతంగా గెలుపు..
ఇటీవల మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలు( Municipal Elections ) జరిగిన సమయంలో ఆయాచోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇప్పుడు అదే చోట టిడిపి నేతలు గెలిచారు. దానినే ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్కు రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి.. నిబద్దతతో నిలబడి.. విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ.. చంద్రబాబు మావి నీ మాదిరి రాజకీయాలు కాదు.. ఎంపీటీసీలమైన.. జడ్పిటిసిలమైన మమ్మల్ని చూపి నేర్చుకోమని చంద్రబాబు కూడా చూపించి గొప్ప తెగువ చూపించారని పార్టీ శ్రేణులను కొనియాడారు.
* కుప్పం కోసం ప్రస్తావన.
మరోవైపు కుప్పం నియోజకవర్గం( Kuppam constitution) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కాదని.. కుప్పమును మున్సిపాలిటీగా మార్చిన ఘనత తమదేనని చెప్పుకున్నారు. కుప్పంకు కోట్లాది రూపాయలతో తాగునీరు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే బలం లేకుండానే కుప్పం మున్సిపాలిటీని టిడిపి బలవంతంగా లాక్కున్న విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ 25 స్థానాలకు గాను 19 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కుప్పంను అక్రమ మార్గంలో గెలుపొంది.. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తప్పుడు సంకేతాలు పంపారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: అమరావతిలో ప్రధాని సభకు జగన్.. కీలక నిర్ణయం!