నటసింహం బాలయ్య బాబుకు మిర్యాల రవీందర్‌రెడ్డి అనే నిర్మాత మొహమాటం లేకుండా ఆంక్షలు పెడుతున్నాడట. షూట్ లో కూడా ఓవర్ బడ్జెట్ అయితే, ముందుగా బడ్జెట్ వివరాలు డైరెక్ట్ గా బాలయ్య బాబుకు పంపిస్తున్నాడట. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘మోనార్క్’ అనే మరో రొటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ఒకటి చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాకి నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి.
Also Read: కుదిరితే స్టార్ తో.. లేదంటే చిన్న హీరోతో !
నిజానికి ఈ సినిమా మొదలుపెట్టకముందు నుంచే అనేక సమస్యలతో సతమతమవుతుండగా.. అనగా ఏ నిర్మాత ముందుకు రాకపోతే మిర్యాల రవీందర్‌రెడ్డినే సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. వచ్చిన మొదటి రోజునే హీరోకు డైరెక్టర్ కు ముందే చెప్పాడట. బడ్జెట్ తక్కువ అయితేనే సినిమా చేస్తాను.. ఓవర్ బడ్జెట్ అయితే.. మీ రెమ్యునరేషన్స్ లో కట్ చేయాల్సి వస్తోంది, మీకు ఇష్టం అయితేనే చేద్దాం లేదంటే లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
Also Read: క్రేజీ సినిమాకి ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ !
అప్పుడు ఒప్పుకున్న బాలయ్య – బోయపాటి ఆ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. ఇప్పుడు బడ్జెట్ సమస్య వచ్చి పడింది. గత కొన్ని ఏళ్లుగా బాలయ్య సినిమాలే, కలెక్షన్స్ విషయంలో పూర్తిగా డిజాస్టర్ లు అవుతున్నాయి. దాంతో బాలయ్య బాబుకు భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలు కరవు అయిపోయారు. దీనికితోడు బాలకృష్ణ గత నాలుగు సినిమాలు గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు.. అలాంటప్పుడు ఏభై డెబ్భై కోట్లు ఏమి చూసి పెట్టాలి అని నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి బాధ పడుతున్నాడట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
మరోపక్క పసలేని యాక్షన్ సీన్స్ లతో, అరిగిపోయిన వార్నింగ్ డైలాగ్సేతోనే బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు అని పేరు కూడా బయటకు వచ్చింది. దాంతో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమా బడ్జెట్ ను తగ్గించమని చెప్పి సుమారు నలభై కోట్లు మాత్రమే తాను ఖర్చు పెడతానని బోయపాటికి క్లారిటీ ఇచ్చాడు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.