AR Rahman On Mahendra: సంగీత విద్వాంసుడు AR రెహమాన్ సినిమా రంగంలోనే కాకుండా ఎలక్ట్రికల్ రంగంలో కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నారు. 75 రకాల సౌండ్‌లను డిజైన్ చేయడానికి మహీంద్రాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సౌండ్స్ మహేంద్ర కార్‌మేకర్ నుండి రాబోయే ఆల్-ఎలక్ట్రిక్ మొదలు కోసం డిజైన్ చేస్తున్నారట. ఇందుకోసం మన ఆస్కార్-విజేత, సంగీత దర్శకుడు AR రెహమాన్ మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ EVలలో సౌండ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బాధ్యత వహిస్తారు.
లాంచ్ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ, “నేను ఎప్పుడు కానీ నా కెరియర్ లో EV ల కోసం సంగీతాన్ని సృష్టిస్తానని ఊహించలేదు . డ్రైవ్ మోడ్‌లు, డ్యాష్‌బోర్డ్, అనుభవ మూడ్‌ల కోసం నేను, నా బృందం ప్రత్యేక సౌండ్‌లను రూపొందిస్తున్నాము” అని అన్నారు.
” నేను ఎప్పుడూ నా మ్యూజిక్ వివిధ మార్గాలలో తెలియజేయాలి అని కోరుకునే వ్యక్తిని. అందుకే మహీంద్ర వారు నా వద్దకు వచ్చినప్పుడు, నేను వారి డిజైన్ చూపిమని వెంటనే మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నాను,” అని తెలియజేశారు.
ఇక ఇదే కార్యక్రమంలో, మహీంద్రా ట్రాక్టర్స్ CEO రాజేష్ జెజురికర్, సాటిలేని 3D సౌండ్ అనుభూతిని అందించడానికి తాము డాల్బీ ATMOS, ఇంక హర్మాన్ కార్డాన్‌ల కంపెనీలతో టై-అప్ అయ్యామని కూడా ప్రకటించారు. తమ బోర్న్ ఎలక్ట్రిక్ వాహనాలు “చక్రాలపై కచేరీ హాల్”గా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ఇక హన్స్ జిమ్మర్ బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్ల కోసం “ఐకానిక్ సౌండ్స్” ని సృష్టించినట్లుగా, ఇప్పుడు మహీంద్రా తమ బోర్న్ ఎలక్ట్రిక్ EVల కోసం సౌండ్‌లను కంపోజ్ చేయడానికి AR రెహమాన్‌ని తీసుకొచ్చింది అంటు నెటిజన్స్ సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతున్నారు.