Vijay Deverakonda On Samantha: విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. వేదికపై విజయ్ దేవరకొండ-సమంత సందడి చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సెప్టెంబర్ 1న ఖుషి విడుదల చేస్తున్నాం. మీరంతా నవ్వుతూ థియేటర్ నుండి బయటకు వచ్చిన సినిమా ఎప్పుడు ఇచ్చానో గుర్తు లేదు. ‘విజయ్ బ్రో మీ ముఖంలో నవ్వు చూడాలి. అదొక్కటే మనసులో పెట్టుకుని పని చేస్తున్నాను’ అని శివ అన్నారు.
నా ముఖంలోనే కాదు సమంత ముఖంలో కూడా నవ్వు చూడాలి. ఆమె ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఖుషి మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా ఆమె అనారోగ్యం బారిన పడ్డారు. మొదట్లో తేలికగా తీసుకున్నాం. తర్వాత పరిస్థితి అర్థమైంది. అందుకే కొన్ని రోజులు విరామం తీసుకోమని చెప్పాము. ఈ సమయంలో నేను వేరే చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నాను. అప్పుడు ఆమె కండీషన్ గురించి తెలిసింది… అని విజయ్ దేవరకొండ అన్నారు.
విజయ్ దేవరకొండ సమంతను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంతకు ఉన్న సమస్య అంత చిన్నదేం కాదని ఆయన చెప్పినట్లు అయ్యింది. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఖుషి చిత్రానికి అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.
ఇక విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. గీత గోవిందం అనంతరం ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. గీత గోవిందం విడుదలై 5 ఏళ్ళు అవుతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఖుషి మూవీతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఖుషి చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా పాటలు బాగున్నాయి. దీంతో అంచనాలు పెరిగాయి. ఖుషి విజయ్ దేవరకొండకు హిట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సమంత గత చిత్రం శాకుంతలం కూడా భారీ పరాజయం చవిచూసింది.