Jada Sravan: కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలలో జడ శ్రావణ్ సృష్టిస్తున్న సంచలనం అంతా అంతా కాదు. అప్పట్లో క్రైస్తవులు సమావేశం పెట్టుకుంటే.. దానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు శ్రావణ్.. పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. పది చదివిన నువ్వే ఉప ముఖ్యమంత్రి అవ్వంగా లేనిది.. జడ్జి చదివిన నేను ఉపముఖ్యమంత్రి అయితే తప్పేంటయ్యా అంటూ శ్రవణ్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పట్నుంచి శ్రవణ్ ఏదో ఒక సందర్భంలో.. ఏదో ఒక రీతిగా పవన్ కళ్యాణ్ మీద.. జనసేన మీద.. కూటమి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
జడ శ్రవణ్ ఇటీవల యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు పట్ల స్పందించారు. ఆయనను అరెస్టు చేసిన ప్రతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి బెయిల్ మీద విడిపించుకుని వచ్చారు. అయితే ఈసారి ఏపీ పోలీసులు సరికొత్త ఆధారాలను సంపాదించారు.. జోసెఫ్ అలియాస్ రావణ్ మీద రాజ ద్రోహం కేసు పెట్టారు. ఉపా చట్టం కింద అతడి మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రావణ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆ మధ్య రావణ్ కు.. వైసిపికి అనుకూలంగా మాట్లాడారు శ్రవణ్.. పైగా వచ్చేది వైసిపి ప్రభుత్వం అని.. ఉపముఖ్యమంత్రిగా శ్రావణ్ ఉంటారని.. జగన్ ముఖ్యమంత్రి అవుతారని సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబర్లు వీడియోలు కూడా చేశారు.
వైసిపికి అనుకూలంగా మాట్లాడిన శ్రవణ్ ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చారు. తనకు వైసిపి నేతలు ఫండింగ్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో.. ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదిలిపెట్టరని.. వాటిని కూడా ఏరుకొని తింటారని.. అలాంటప్పుడు వాళ్లు తనకు ఫండింగ్ ఎలా చేస్తారని శ్రావణ్ ప్రశ్నించారు.. తన వెనుక ఎవరూ లేరని .. ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదని శ్రవణ్ స్పష్టం చేశారు. అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 500 కేసులు వేసినందుకు.. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టానని శ్రవణ్ పేర్కొన్నారు. వాస్తవానికి ఆ కేసులకు అంతస్థాయిలో డబ్బు ఎక్కడిది.. అంత డబ్బును శ్రావణ్ ఎలా సంపాదించగలిగారు అనే చర్చ కూడా నడిచింది.. మొత్తానికి వైసీపీ నేతలకు షాక్ ఇచ్చే విధంగా శ్రవణ్ వ్యాఖ్యలు చేయడంతో ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
