https://oktelugu.com/

Anant Ambani Radhika merchant : అంబానీ ఇంట పెళ్లికి అతిథులు వీరే..

ఇటలీలోని కోమో అనే అందమైన సరస్సు తీరంలో ఇషా పెళ్లిని ముఖేష్ జరిపించారు. ఈ పెళ్లి కోసం దాదాపు 828 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఇది అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డుకెక్కింది.

Written By: , Updated On : March 1, 2024 / 08:44 PM IST
Follow us on

Anant Ambani Radhika merchant : “సిరిగల వానికేదైనా చెల్లున్” అనే పద్యం తీరుగా.. ఇండియాలో అపర కుబేరుడు, ఆసియాలోనూ అతిపెద్ద శ్రీమంతుడు ముఖేష్ అంబానీ ఇంట ముందస్తు పెళ్లి వేడుక జరుగుతోంది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుక జామ్ నగర్ లో శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకను న భూతో, న భవిష్యత్ అనే స్థాయిలో ముకేశ్ అంబానీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు మొత్తం ఈ వేడుకకు హాజరయ్యారు.. వారికోసం జామ్ నగర్ ప్రాంతంలో రిలయన్స్ సంస్థ అత్యాధునిక ఆల్ట్రా లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేసింది. వారు జామ్ నగర్ వచ్చేందుకు ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసింది..

ఎవరెవరు వచ్చారంటే

మూడు రోజులపాటు జరిగే ముందస్తు పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు షారుక్ ఖాన్ కుటుంబం, బాలీవుడ్ నటీనటులు రాణి ముఖర్జీ, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, సైనా నెహ్వాల్ , హార్దిక్ పాండ్యా, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ముందస్తు పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. “పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. కానీ భారీ పెళ్లిళ్లు అంబానీ ఇంట్లోనే జరుగుతాయి అన్నట్టుగా ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారని” జాతీయ మీడియా కోడైకుస్తోంది. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ కోసం నిర్వహించిన రెడ్ కార్పెట్ సెర్మని అదిరిపోయిందని నేషనల్ మీడియా వర్గాలు అంటున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల కోసం సుమారు 1000 కోట్ల వరకు ముఖేశ్ అంబానీ ఖర్చు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

రిలయన్స్ రిఫైనరీ సమీపంలో..

జామ్ నగర్ లోని రిలయన్స్ రిఫైనరీ మైదానంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేశారు. ముందస్తు వివాహ వేడుక జరుగుతున్న పరిసర ప్రాంతంలోనే కోటి దాకా మామిడి చెట్లు ఉన్న తోట ఉంది. దాని పక్కనే వంతారా అనే పేరుతో అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న జంతు సంరక్షణ శాల కూడా ఉంది. ముందస్తు వేడుకలకు హాజరైన అతిథులు ఆ ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు.

2,500 వంటకాలు

వేడుకలకు హాజరైన అతిధులకు రిహానా, డేవిడ్ బ్లేయిన్ వంటి వారు వినోదాన్ని పంచుతున్నారు. ఇప్పటికే వారు చేసిన రిహార్సల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన అతిథులకు 2,500 రకాల వంటకాలను సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మూడు రోజుల్లో వడ్డించే వంటకాల్లో ఏవీ కూడా రిపీట్ కావని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వంటకాను తయారు చేసేందుకు మధ్యప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా చెఫ్ లను రప్పించారు..

రాధికా మర్చంట్ ఎవరంటే

కాగా, రాధికా మార్చంట్ తండ్రి ఎన్ కోర్ హెల్త్ కేర్ అనే పేరుతో అతిపెద్ద ఫార్మా కంపెనీ నిర్వహిస్తున్నారు.. ఆయన కుమార్తె రాధికా ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి కూడా. కాగా ఇప్పుడు 1,000 కోట్లతో ఖర్చు పెట్టి చేస్తున్న ముందస్తు పెళ్లి వేడుకల్లో అనంత్ అంబానీ చెయ్యి అందుకోబోతున్నారు. కాగా, ముకేశ్ అంబానీ 2018లో ఆకాశమంత పందిరి వేసి తన కూతురు ఈషా పెళ్లి జరిపించారు.. ఇటలీలోని కోమో అనే అందమైన సరస్సు తీరంలో ఇషా పెళ్లిని ముఖేష్ జరిపించారు. ఈ పెళ్లి కోసం దాదాపు 828 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఇది అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డుకెక్కింది.