Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Singapore Visit: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!

Chandrababu Singapore Visit: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!

Chandrababu Singapore Visit: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మీరు చదివింది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ ఓ నాలుగు రోజులు పాటు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండనున్నారు. అదికూడా ఇన్చార్జ్ హోదాలోనే. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్ళనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ కొనసాగనుంది. ఈ ప్రాంతంలో మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ ఉంటారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి కీలక అధికారుల సైతం ఈ బృందంతో కలిసి వెళ్తారు. ఈనెల 26 నుంచి 30 వరకు అక్కడ పర్యటించనుంది సీఎం బృందం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చేవరకు.. ఇంచార్జ్ హోదాలో కొనసాగనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

జనసైనికుల ఆశ అదే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan) ముఖ్యమంత్రి హోదాలో చూడాలని జనసైనికులు భావిస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీనియారిటీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. అయితే జనసైనికుల్లో మాత్రం పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష తగ్గలేదు. పవన్ తో సమానంగా మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టిడిపి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అప్పట్లో జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరిగింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులకు కంట్రోల్ చేశారు కూడా. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు కూడా. టిడిపి నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తం అయ్యింది. తమ పార్టీ శ్రేణులకు అదే తరహా ఆదేశాలు ఇచ్చింది.

Also Read: Pawan Kalyan as AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?! జనసైనికుల ఫుల్ హ్యాపీ

నాలుగు రోజుల పాటు బాధ్యతలు
ప్రస్తుతం కూటమి( alliance) సమన్వయంగా ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన ధ్యేయంగా ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులు ఆహ్వానించాలని భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఓ బృందం సింగపూర్ వెళ్తోంది. నాలుగు రోజులపాటు వారి పర్యటన కొనసాగనుంది. సీఎం సింగపూర్ వెళ్తున్న గ్రామంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇన్చార్జి సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జన సైనికులకు మాత్రం ఈ వార్త ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular