Amul Franchise: కొత్తగా వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించే వాళ్లకు అమూల్ డెయిరీ ఫ్రాంఛైజ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టడం ద్వారా బిజినెస్ ను స్టార్ట్ చేసిన రోజు నుంచే మంచి లాభాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. దేశంలోని ప్రముఖ డెయిరీ బ్రాండ్ లలో అమూల్ కూడా ఒకటనే విషయం తెలిసిందే. అమూల్ పాల ఉత్పత్తులతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా కలిగి ఉంది.

దేశవ్యాప్తంగా అమూల్ బ్రాండ్ కు మంచి గుర్తింపు ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అమూల్ ఫ్రాంఛైజీ కావాలని భావించే వాళ్లు 022 – 68526666 నంబర్ కు ఈ మెయిల్ చేయడం ద్వారా ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక కస్టమర్ కేర్ నంబర్ అయిన ఈ నంబర్ కు కాల్ చేయడం ద్వారా అమూల్ ఫ్రాంఛైజ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ నంబర్ కు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్రాంఛైజ్ కొరకు దరఖాస్తు చేసుకునే వాళ్లు 25,000 రూపాయల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా సెక్యూరిటీ ఫీజును చెల్లిస్తే మంచిదని చెప్పవచ్చు. కొన్ని నకిలీ కంపెనీలు అమూల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో అమూల్ ఈ నిర్ణయం తీసుకుంది.
అమూల్ లో రెండు రకాల ఫ్రాంచైజీలు ఉండగా మొదటి అవుట్ లెట్ ను కియోస్క్ అంటారు. 25,000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ తో ఈ ఫ్రాంఛైజ్ తీసుకోవాలి. ఈ ఉత్పత్తుల ద్వారా 10 శాతం నుంచి 20 శాతం మార్జిన్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అమూల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ రెండో ఫ్రాంఛైజీ మోడల్ కాగా దీనికి 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. retail@amul.coop మెయిల్ కు ఈ ఫ్రాంఛైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.