Homeబిజినెస్Google Pixel 10 price drop: Google pixel ఫోనుపై అద్భుత ఆఫర్.. ఏకంగా 11...

Google Pixel 10 price drop: Google pixel ఫోనుపై అద్భుత ఆఫర్.. ఏకంగా 11 వేల తగ్గింపు.. వెంటనే త్వరపడండి..

Google Pixel 10 price drop: కొంతమందికి ప్రీమియం ఫోన్లను కొనాలని ఆశ ఉంటుంది. కానీ వాటి ధరలను చూసి వెనుకడుగు వేస్తారు. అయితే కంపెనీలు బడ్జెట్ లోనే ఫోన్లను అందించేందుకు ఒక్కోసారి ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా Google Pixel అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. దాదాపు రూ.11,000 వరకు డిస్కౌంట్ అందించే మొబైల్ ను అందుబాటులో ఉంచింది.. ఈ మొబైల్ పై డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఫ్లాగ్ ఫిష్ వంటి సాఫ్ట్వేర్ తో ఎక్కువ కాలం మన్నికగా ఉండే మొబైల్ గా చెబుతున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఆఫర్ వివరాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

Google Pixel 10 మొబైల్ గురించి ఫోన్ వినియోగదారులకు తెలిసే ఉంటుంది. ఇందులో ఫీచర్లు నేటి తరం యూత్ కు అనుగుణంగా ఉంటాయి. ఈ మొబైల్లో 6.3 అంగుళాల OLED డిస్ప్లే ఉండనుంది. ఇది 3000 నిట్స్ బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ కు అనుగుణంగా ఉండనుంది. దీంతో లేటెస్ట్ మూవీస్ చూడాలని అనుకునే వారితో పాటు.. గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీ కోరుకునే వారు సైతం ఈ మొబైల్ ను ఎంపిక చేసుకోవచ్చని అంటున్నారు.

ప్రతి మొబైల్ లో కెమెరా గురించి వివరాలు తెలుసుకుంటున్నారు నేటి వినియోగదారులు. ఎందుకు అనుగుణంగా Google pixel 10 మొబైల్ లో నాణ్యమైన ఫోటోలను అందించే కెమెరాలు అమర్చారు. ఇందులో 48 MP ప్రైమరీ కెమెరా ఉండనుంది. అలాగే 13 MP ఆల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా పనిచేయనుంది. ఈ కెమెరా ఎంత దూరంలో ఉన్న ఫోటోలను జూమ్ చేసినా కూడా resolution తప్పకుండా ఉంటుంది. అలాగే 10.8 MP టెలిఫోటో కూడా ఉండడంతో కావాల్సిన ఫోటోలను అందిస్తుంది. 10.5 MP ఫ్రంట్ కెమెరా సైతం సెల్ఫీలతో పాటు, వీడియో కాలింగ్ కోసం అనుకూలంగా ఉంటుంది.

నేటి కాలంలో చాలామంది రోజువారి అవసరాల కోసం ఎక్కువగా మొబైల్ యూస్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బ్యాటరీ మెరుగ్గా ఉంటేనే బాగుంటుంది. అయితే గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ లో 4,970 mAh బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ 30 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పనిచేస్తుంది. అలాగే 15 W వైర్లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేయనుంది. దీంతో ఏఐ తరహాలో ఫోటోలను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇలాంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న గూగుల్ పిక్సెల్ పై లేటెస్ట్గా భారీ ఆఫర్ ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ మొబైల్ రూ.79,999 ధరతో విక్రయిస్తున్నారు. అయితే ఫ్లిప్కార్ట్ లో దీనిని కొనుగోలు చేస్తే రూ.6,000 ఫ్లాష్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే HDFB బ్యాంకు క్రెడిట్ కార్డు పై లావాదేవీలు జరిపితే రూ.5,000 అదనంగా తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తంగా రూ.11,000 తగ్గింపుతో ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular