MG M9 EV Features: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు విండ్సర్ ఈవీని విక్రయించే ఎంజీ మోటార్ ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు పేరు ఎంజీ ఎం9 ఈవీ. దీనిని లగ్జరీ ఎంపీవీ సెగ్మెంట్లోకి తీసుకువచ్చారు. ఇది ఎంజీ కంపెనీ అత్యంత లగ్జరీ ఎలక్ట్రిక్ కారు. ఇది ఎంపీవీ సెగ్మెంట్‌లో టయోటా వెల్‌ఫైర్ కు గట్టి పోటీని ఇవ్వనుంది. అయితే, వెల్‌ఫైర్ ఒక ఐసీఈ కారు అయినప్పటికీ, లగ్జరీ సెగ్మెంట్ ప్రకారం ఇవి ఒకదానికొకటి పోటీపడతాయి. ఎం9 ఈవీ ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ, వెల్‌ఫైర్ ధరలో సగం ధరకే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.69.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). మరోవైపు, వెల్‌ఫైర్ ప్రారంభ ధర సుమారు రూ.1.22 కోట్లు (ఎక్స్-షోరూమ్).
ఎంజీ ఎం9 ఈవీ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ఆగస్టు 10 నుండి ప్రారంభం కానున్నాయి. దీనిని ఎంజీ సెలెక్ట్ మొదటి ప్రొడక్టుగా రిలీజ్ చేశారు. ఇది అన్ని ఫెసిలిటీలతో కూడిన కంప్లీట్ ఎలక్ట్రిక్ ఎంపీవీగా అందుబాటులో ఉంటుంది. దీనిని ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా ఎంజీ సైబర్‌స్టర్ తో పాటు విక్రయిస్తారు, ఎంజీ సైబర్‌స్టర్ కూడా కార్ల తయారీ సంస్థ లగ్జరీ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు.
ఎంజీ ఎం9 ఈవీ స్పెషల్ బాక్సీ డిజైన్తో వచ్చింది. ఇందులో కింద ఉన్న హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఫ్రంట్, రియర్ ఓవర్‌హాంగ్స్, పెద్ద కనెక్టెడ్ టెయిల్ లైట్స్ వంటివి ఉన్నాయి. క్యాబిన్ లోపల అడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడిన అనేక ఫెసిలిటీలు ఉన్నాయి. దీని మూడు వరుసల సీట్లలో బ్రౌన్, బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. వెనుక కూర్చునే వారికి పవర్‌డ్ కెప్టెన్ సీట్లు లభిస్తాయి. ఇది ఈ ఈవీ మెయిన్ స్పెషాలిటీ.
Also Read: Mahindra XUV700: 7 సీటింగ్, పవర్ఫుల్ ఇంజిన్.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. ఇప్పటికే 3లక్షల మంది కొన్నారు
కారు ఇతర లగ్జరీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 12.23 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7.0 అంగుళాల కంప్లీట్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డిజిటల్ ఐఆర్‌వీఎం, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, 13-స్పీకర్ జెబిఎల్ సౌండ్ సిస్టమ్, లెదర్ సాబర్ అప్‌హోల్‌స్ట్రీ, హీటింగ్, మసాజ్, వెంటిలేషన్తో కూడిన పవర్‌డ్ ఫ్రంట్, రియర్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ కారులో 90 kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 548 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ కారు. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 245 బీహెచ్‌పీ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుతో ఇతర కార్లను కూడా ఛార్జ్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా, సేఫ్టీ కోసం ఎంజీ ఎం9 లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో లెవెల్ 2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు వెనుక డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.