Alto K10: ఇంట్లో కూరగాయలు తీసుకురావడానికి.. పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయడానికి.. స్వల్ప దూరంలో ఏదైనా అవసరానికి ప్రయాణం చేయడానికి సాధారణంగా మధ్యతరగతి ప్రజలు బైక్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే నలుగురు ఉండే చిన్న ఫ్యామిలీ ఒక్కోసారి అందరూ కలిసి స్వల్పదూరం ప్రయాణం చేయాలంటే బైక్ సరిపోదు. అంతేకాకుండా ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయడానికి కూడా బైక్ పై ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చిన్న కారు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అయితే ధర, మెయింటెనెన్స్ విషయంలో చాలామంది వెనుకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు బైక్ కంటే కాస్త ఎక్కువ ధరలో కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉండడంతో బైక్ కొనే బదులు వీటిని కొంటే ఎంతో సేఫ్ అని కొందరు నిపుణులు అంటున్నారు. మరి అలాంటి కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
కారు కొనుగోలు చేసేటప్పుడు చాలామంది రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ ఒక్కోసారి బడ్జెట్లో కార్లు కొనుగోలు చేస్తే బైక్ కు అయ్యే ఖర్చు మాత్రమే అవుతుంది. అలాంటి వాటిలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన Alto K10 కారు ఒకటి. ఇది చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది. పట్టణాల్లో, నగరాల్లో ఉండేవారు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఇది ట్రాఫిక్ లో నుంచి బయటకు పోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ కారు పార్కింగ్ స్పేస్ కూడా తక్కువగా ఉండడంతో వీధిలో నుంచి ప్రయాణం చేయడానికి సులభంగా ఉంటుంది. ఇందులో పెట్రోల్ తోపాటు సిఎన్జి ఆప్షన్ కూడా ఉండడంతో మైలేజ్ పొదుపు అయ్యే అవకాశం ఉంది. దీనిని మార్కెట్లో రూ.3.69 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే కొన్ని ఫీచర్స్ అదనంగా కావాలంటే ధర పెరిగే అవకాశం ఉంది. రోజువారి ప్రయాణికులకు ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.
దేశంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న టాటా కంపెనీ నుంచి తక్కువ ధరలో ఉండే కార్లు ఉన్నాయి. వీటిలో Tiago కారు బెస్ట్ ఎంపిక అని చెప్పుకోవచ్చు. దీని ధర రూ.4.57 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా..CNG ఆప్షన్ కూడా ఉండడంతో ఇంధన సేఫ్ ఎక్కువగా చేసుకోవచ్చు. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఈ కారులో స్పేస్ స్పీసిఎస్ కూడా ఎక్కువగా ఉండడంతో చాలా దూరం ప్రయాణించినా కూడా ఎలాంటి అలసట ఉండదు. ఈ కారు నగరాల్లో మాత్రమే కాకుండా దూర ప్రయాణాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో కొన్ని ద్విచక్ర వాహనాలు లక్షకు మించి ధరలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలతో ఒకేసారి నలుగురు ప్రయాణికులు వెళ్లడం కష్టంగా ఉంటుంది. అందువల్ల బడ్జెట్లో ఇలాంటి చిన్నకారులను కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కార్లు బెస్ట్ ఎంపిక అని నిపుణులు అంటున్నారు.