Aloe Vera Cultivation: ప్రస్తుతం దేశంలోని రైతులలో ఎక్కువమంది రైతులు లాభసాటి వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే పంటల సాగు దిశగా రైతులు అడుగులు వేస్తుండటం గమనార్హం. తక్కువ పెట్టుబడితో కలబందను సులభంగా సాగు చేసే అవకాశం అయితే ఉంటుంది. కలబందను అలోవేరా అనే పేరుతో కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలలో కలబందను సాగు చేస్తున్నారు.
అన్ని రకాల నేలలలో కలబందను సాగు చేయవచ్చు. తేలికపాటి, నీరు నిల్వ ఉండే నేలలు కలబంద సాగుకు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్ధితుల్లో కలబందను పెంచే అవకాశం అయితే ఉంటుంది. కలబందను నాటిన పది మాసాల్లో మొదటి కోత రాగా ఆ తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఆకులను సేకరించుకోవడంతో పాటు ఐదు సంవత్సరాల పాటు దిగుబడిని పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఎకరాకు 8,000 నుంచి 10,000 కలబంద పిలకలను నాటే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇందుకోసం పశువుల ఎరువును మాత్రమే వాడితే సరిపోతుంది. నీటి పారుదల ఉంటే ఎక్కువ దిగుబడిని పొందే అవకాశాలు ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయంలో మాత్రమే కలబంద మొక్క ఆకులను తీసుకోవచ్చు. ఆకులతోపాటు పిలకలను అమ్మడం ద్వారా రైతులకు ఎక్కువగా ఆదాయం వస్తుంది.
కేవలం 50,000 పెట్టుబడితో 10 లక్షల రూపాయల వరకు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఆయుర్వేదం, ఫేస్ క్రీమ్స్ లో కలబందను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నవాటిలో కలబంద ఒకటని చెప్పవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Aloe vera cultivation get 10 lakhs per year in aloe vera cultivation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com