Maruti Suzuki : మారుతి కస్టమర్లకు బిగ్ అప్డేట్.. ఇక నుంచి ధర పెంచకుండానే అన్ని కార్లలో ఆ ఫీచర్స్..

కంప్యూటరైజ్డ్ ఆధారంగా వాహనాన్ని ప్రమాదం నుంచి తప్పించే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో కారు స్థిరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఇది ఉండడం వల్ల సేప్టీగా గమ్య స్థానానికి చేరుకుంటారు.

Written By: NARESH, Updated On : August 24, 2024 5:54 pm

Maruti Suzuki

Follow us on

Maruti Suzuki : దేశంలో కార్ల విక్రయాల్లో మారుతి కంపెనీ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. సామాన్యుల నుంచి ఖరీదైన కార్లు తీసుకురావడం ఈ కంపెనీ ప్రత్యేకత. అందుకే ఈ కంపెనీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల స్విప్ట్ లాంటి మోడల్ ను అప్ గ్రేడ్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చొంది. ఇది వచ్చిన కొన్నాళ్లకే మంచి అమ్మకాలు సాధించింది. అయితే మారుతికి చెందిన కొన్ని కార్లు సేప్టీ విషయంలో తక్కువ రేటింగ్ ను పొందుతున్నాయి. ఇప్పటికే నిర్వహించిన గ్లోబల్ టెస్ట్ లో కొన్ని మోడళ్లు తక్కువ స్టార్లను కలిగి ఉన్నాయి. కానీ లేటేస్ట్ కార్లలో సేప్టీ విషయంలో ప్రత్యేక శద్ధ చూపిస్తోంది. ఇక నుంచి అన్ని కార్లలో కొత్త ప్రోగ్రామ్ ను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ముందుగా ఈ కంపెనీకి చెందిన ఆల్టోలో దీనిని ప్రవేశపెట్టారు. ఆ తరువాత మిగతా కార్లలోనూ దీనిని ప్రవేశపెట్టనున్నారు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి? మారుతి కొత్తగా ఇస్తున్న అప్డేట్ ఏంటి?

మార్కెట్లో ప్రస్తుతం ఉన్న కొన్ని మోడళ్లలో సేప్టీ ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. ఇవి గ్లోబల్ టెస్ట్ లోనూ అత్యధిక రేటింగ్ ను సాధిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మారుతి కంపెనీ సైతం తన కార్లలో సేప్టీ ఫీచర్స్ ను అమలు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. తాజాగా మారుతి ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో కార్లలో ఈ ఎస్పీ ని అందిస్తోంది. ఆ తరువాత అన్ని కార్లలో దీనిని ప్రవేశపెట్టనున్నారు.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) అనేది కారును సేప్టీగా ఉంచుతుంది. ఇది ప్రమాద సమయంలో కీలకంగా పనిచేస్తుంది. ఇది కారులో ఉండడం వల్ల కారు స్టీరింగ్ సరిగ్గా లేకపోయినా సిస్టమ్ ఆన్ అయి కారును సవ్య దిశలోకి తీసుకెళ్తుంది. కారు కంట్రోల్ తప్పిన సమయంలోనూ ఆటోమేటిక్ ఆన్ అయి సరైన దిశలో వెళ్లేలా కృషి చేస్తుంది. ఎప్పుడైతే కారును ఆన్ చేస్తారో.. అప్పటి నుంచే ఈ ఎస్ పీ పనిచేయడం ప్రారంభం అవుతుంది. అయితేప్రమాద సమయంలో మాత్రం ప్రత్యేకంగా పనిచేస్తుంది.

ఇప్పటికీ ఈ ఫీచర్ అన్ని కార్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు మారుతి కంపెనీ దీనిని తన అన్ని కార్లలో ఉంచాలని నిర్ణయించింది. కొంత మంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉన్న కార్లను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఈ ఫీచర్ ఉన్న కార్లు కాస్త ధర ఎక్కువగా ఉన్నాయి. కానీ మారుతి కంపెనీ మాత్ర ఈ ప్రోగ్రామ్ ను అమలు చేసి ఎటువంటి ఎక్కువ ధరను తీసుకోవడం లేదు. ఈ విషయం తెలిసిన చాలా మంది ఇది అమలు చేసిన కార్లను కొనేందుకు రెడీ అవుతున్నారు.

కంప్యూటరైజ్డ్ ఆధారంగా వాహనాన్ని ప్రమాదం నుంచి తప్పించే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో కారు స్థిరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఇది ఉండడం వల్ల సేప్టీగా గమ్య స్థానానికి చేరుకుంటారు. అలాగే ఇది కార్లలో డ్రైవర్లు సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతారు. ఒకవేళ వాహనం దారి తప్పినా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ సిస్టమ్ కలిపి వాహనాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే వాహనాన్ని కంట్రోల్ లో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.