https://oktelugu.com/

ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కు 1 శాతం కేటాయింపులు చేస్తున్నారు. ఆ తరువాత నివాస గృహ ప్రాజెక్టులకు 0.75 శాతం, ఇతర రుణాలకు 0.40 శాతం కేటాయిస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 25, 2024 / 03:43 PM IST

    Sbi Bank Customers

    Follow us on

    జాతీయ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి పెద్దది. ఈ బ్యాంకు మిగతా వాటికంటేఎక్కువ మంది ఖాతాదారులను కలిగి ఉంది. దీంతో ఈ బ్యాంకు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల చాలా మందిపై ప్రభావం పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వినియోగదారులకు చేరువలో ఉంటోంది. తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకోనుంది. రుణాలు ఇచ్చే విషయంలో ప్రొవిజనింగ్ నిబంధనలు అమలు చేయాలని అనుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదలు ఇప్పటికే రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా కొత్త లోన్ క్లాజ్ ను చేర్చనుంది. వివరాల్లోకి వెళితే..

    ఎస్బీఐ లోన్ డాక్యుమెంట్ కొత్త క్లాజ్ ప్రకారం.. బ్యాంకుకు సంబంధించి అధిక కేటాయింపులు జరపాల్సి వస్తే.. ఆ మొత్తానికి సంబంధించిన భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయొచ్చు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన నిబంధనలు ఏర్పరిచి మే నెల ఆరంబంలోనే మార్గదర్శకాలను జారీ చేసింది. ముందుగా ఈ కేటాయింపులు నిర్మాణంలో ఉన్న రియల్ ఎస్టేట్ లపై 5 శాతం కేటాయిస్తారు. ఆ తరువాత నిబంధన క్రమంగా తగ్గుతుంది.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కు 1 శాతం కేటాయింపులు చేస్తున్నారు. ఆ తరువాత నివాస గృహ ప్రాజెక్టులకు 0.75 శాతం, ఇతర రుణాలకు 0.40 శాతం కేటాయిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం 9 వేల కోట్ల అదనపు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వాటి కంటే 28 శాతం ఎక్కువ. రుణాలు ఇచ్చే విషయంలో ఆర్బీఐ నిబంధనలు బ్యాంకులు పాటిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టుల కోసం వడ్డీ రేట్లను పెంచే హక్కును కలిగి ఉంటాయి.

    కొత్త లోన్ క్లాజ్ కు సంబంధించిన విషయాలను ఎస్బీఐ స్పష్టంగా తెలియజేయడం వల్ల ఆర్బీఐ రూల్స్ ను అతిక్రమించినట్లవదు. పైగా 5 శాతం నిబంధన విధించాలనే ఆర్బీఐ నిర్ణయం వల్ల ప్రాజెక్టు నిర్మాణ కాలంలో ఏదైనా డిపాల్ట్ సమాచారం అధిగమించడంలో బ్యాంకులకు ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా పెద్ద కార్పొరేట్ సంబంధాలను కొనసాగించాలనే ఒత్తిడి కారణంగా ప్రతిపాదిత కేటాయింపుల పెరుగుదల ప్రభావంపై తమకు పరిమిత సామర్థ్యం ఉంటుందని బ్యాంకులు ఆర్బీఐకి తెలియజేశాయి.