రూ.3,475 పెట్టుబడి పెడితే.. నెలకు రూ.40వేలు రిటర్న్స్.. ఎలాగో తెలుసుకోండి..

నేషనల్ పెన్సన్ స్కీం (ఎన్ఎస్పీ) ద్వారా 21 ఏళ్ల వయసులో ఉన్న వారు ప్రతి నెలా రూ.3,475 ఇన్వెస్ట్ మెంట్ చేసుకుంటూ పోతే రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి అంటే 60 ఏళ్లు ఇలా చెల్లించాలి. మొత్ంగా 39 ఏళ్ల పాటు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం కలిపితే రూ.1,626,300 జమ అవుతుంది.

Written By: Chai Muchhata, Updated On : May 25, 2024 3:45 pm

indian-investment-abroad-2

Follow us on

వయసులో ఉన్నప్పుడు అందరూ డబ్బు సంపాదిస్తారు. కావాల్సినంతా ఎంజాయ్ చేస్తారు. కానీ రిటైర్మెంట్ సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఒకప్పుడు పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఒకేసారి మొత్తాన్ని చెల్లిస్తున్నారు. కానీ ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి అవకాశాలు లేవు. ఈ సమయంలో వీరి పనిచేయడం ఆపేసిన తరువాత ఇతరులపై ఆధారపడకుండా నెలనెలా కొంత మొత్తం వస్తే వారి ఖర్చులకు ఉపయోగపడుతాయి. కానీ ఇలా రావాలంటే ఇప్పటి నుంచే కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ మెంట్ చేసుకుంటూ పోవాలి. మరి ఏ వయసు వారు ఎంత మొత్తాన్ని ఇన్వెస్ట్ మెంట్ చేయాలి?

నేటి కాలంలో చిన్న వయసులోనే జాబ్ కొట్టేస్తున్నారు. ఐటీ సెక్టార్ 25 ఏళ్లు నిండకముందే లక్షల్లో జీతం ఎత్తుతున్నారు. అయితే భారీ జీతం రాగానే చాలా మంది డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలో అర్థం కాదు. కొందరు బ్యాంకుల్లో నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. మరికొందరు జల్సాలకు ఖర్చు చేస్తారు. కానీ కొన్ని మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్ లో ఎవరిపై ఆధారపడుకుండా దర్జాగా జీవించవచ్చు. ఇలా చేయాలంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి.

నేషనల్ పెన్సన్ స్కీం (ఎన్ఎస్పీ) ద్వారా 21 ఏళ్ల వయసులో ఉన్న వారు ప్రతి నెలా రూ.3,475 ఇన్వెస్ట్ మెంట్ చేసుకుంటూ పోతే రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి అంటే 60 ఏళ్లు ఇలా చెల్లించాలి. మొత్ంగా 39 ఏళ్ల పాటు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం కలిపితే రూ.1,626,300 జమ అవుతుంది. దీనిపై 10 శాతం రాబడి అంచనా వేస్తే మొత్తం రూ.2,00, 19,029 అవుతుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా 60 శాతాన్ని తీసుకొని మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ కోసం వినియోగించుకోవచ్చు.

అంటే మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టుడం ద్వారా 6 శాతం రాబడి నెలనెలా వస్తుంది. అంటే 80,07,612 మొత్తం మీద నెలకు రూ.40,038 పెన్షన్ వస్తుంది. దీంతో మలి వయసులో ఇతరులపై ఆధారపడకుండా వివిధ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. లేదా మరికొన్ని పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.