ఎయిర్ టెల్ యూజర్లకు శుభవార్త.. కొత్తగా కారు ఇన్సూరెన్స్ స్కీమ్..?

దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎవరైతే ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులో చేరి ఉంటారో వారికి ఉచితంగా కారు ఇన్సూరెన్స్ అందిస్తోంది. జియో ఎంట్రీ తరువాత మార్కెట్ లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నిస్తోంది. ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ సహాయంతో కారు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. భారతి అక్సా జనరల్ ఇన్సూరెన్స్ తో కలిసి ఎయిర్ టెల్ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 9, 2020 8:29 pm
Follow us on


దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎవరైతే ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులో చేరి ఉంటారో వారికి ఉచితంగా కారు ఇన్సూరెన్స్ అందిస్తోంది. జియో ఎంట్రీ తరువాత మార్కెట్ లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నిస్తోంది. ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ సహాయంతో కారు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.

భారతి అక్సా జనరల్ ఇన్సూరెన్స్ తో కలిసి ఎయిర్ టెల్ ఇన్సూరెన్స్ సర్వీసులను అందిస్తోంది. ఎయిర్ టెల్ కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ సహాయంతో ఇతరులకు సులభంగా నగదు బదిలీ చేయడంతో పాటు మరెన్నో సేవలను ఎయిర్ టెల్ అందిస్తోంది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ లోని బ్యాంకింగ్ విభాగంగా కారు ఇన్సూరెన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు ఇన్సూరెన్స్ కు రిజిష్టర్ చేసుకోవచ్చు.

ఎయిర్ టెల్ యూజర్లు కారుకు ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం ఎటువంటి పేపర్లు అవసరం లేదు. కారు దొంగతనం జరిగినా ఏవైనా ప్రమాదాలు జరిగినా ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ఎయిర్ టెల్ ఆర్థిక సాయం అందిస్తోంది.

వినియోగదారులు వాహన తనిఖీ కూడా అవసరం లేకుండా ఈ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. ఎయిర్ ‌టెల్ థాంక్స్ యూజర్లు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ను వినియోగించుకోగలుగుతారు.