https://oktelugu.com/

నువ్వు మగాడివి అయితే.. కేటీఆర్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ కుట్రలు పన్ని విధ్వంసాలకు ప్రయత్నిస్తోందన్న మంత్రి కేటీఆర్ ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తామని.. కవితకు పట్టిన గతే.. కేటీఆర్ పట్టిస్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిప్పులు చెరిగారు. వరద సాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. కేటీఆర్ జేబులోంచి ఇస్తున్నది కాదని.. ప్రజల పన్నులే వారికి చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని ఎంపీ అరవింద్ అన్నారు. కేంద్రం నిధులనే వరదసాయంగా ఇస్తూ కేటీఆర్, […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 08:23 PM IST
    Follow us on

    తెలంగాణలో బీజేపీ కుట్రలు పన్ని విధ్వంసాలకు ప్రయత్నిస్తోందన్న మంత్రి కేటీఆర్ ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తామని.. కవితకు పట్టిన గతే.. కేటీఆర్ పట్టిస్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిప్పులు చెరిగారు.

    వరద సాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. కేటీఆర్ జేబులోంచి ఇస్తున్నది కాదని.. ప్రజల పన్నులే వారికి చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని ఎంపీ అరవింద్ అన్నారు. కేంద్రం నిధులనే వరదసాయంగా ఇస్తూ కేటీఆర్, కేసీఆర్ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.

    దుబ్బాకలో ఏడు చెరువుల నీళ్లు తాగించామని.. సిరిసిల్లలో నువ్వు ఓడకపోతే అడుగు. నువ్వు మగాడివే అయితే కార్యకర్తకు క్షమాపణ చెప్పాలి.. బీజేపీ కార్యకర్తలను విమర్శించడం మానేయ్. రానివారి కోసం పోరాటం చేస్తే తప్పేముంది?’ అని ఎంపీ అరవింద్ మండిపడ్డారు.

    ఓవైసీకి చెమ్చాగిరీ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ చేశానని కేటీఆర్ చెప్పుకుంటున్నారు.. పాత బస్తీలో పాన్ దుకాణం తీయాలన్నా కేటీఆర్ ప్యాంట్ తడిసిపొద్దీ అని బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలతో హోరెత్తించారు.