విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి 50 శాతం డిస్కౌంట్.. కానీ?

ఈ మధ్య కాలంలో విమానయాన సంస్థలు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిరిండియా సీనియర్ సిటిజన్ల కోసం సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. టికెట్ రేటుతో సంబంధం లేకుండా ఎయిర్ ఇండియా ఈ ఆఫర్ ను ఇస్తూ ఉండటంతో ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. Also Read: తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..? 60 సంవత్సరాల వయస్సు దాటిన […]

Written By: Kusuma Aggunna, Updated On : December 17, 2020 1:30 pm
Follow us on


ఈ మధ్య కాలంలో విమానయాన సంస్థలు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిరిండియా సీనియర్ సిటిజన్ల కోసం సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. టికెట్ రేటుతో సంబంధం లేకుండా ఎయిర్ ఇండియా ఈ ఆఫర్ ను ఇస్తూ ఉండటంతో ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read: తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

60 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులు ఈ ఆఫర్ కు అర్హులు. అయితే ఈ ఆఫర్ కు అర్హత పొందాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మన దేశంలోని వారు మాత్రమే ఈ ఆఫర్ ను పొందడానికి అర్హులు. మన దేశానికి చెందిన వారు కావడంతో పాటు మన దేశంలో స్థిర నివాసం ఉన్నవాళ్లు టికెట్ ను బుకింగ్ చేసుకోవడం ద్వారా 50 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నా ప్రయాణ తేదీ నాటికి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వాళ్లు ఈ ఆఫర్ ను పొందవచ్చు.

బుకింగ్ చేసుకున్న వారు వయస్సుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను టికెట్ ను బుకింగ్ చేసుకునే సమయంతో పాటు చెక్ ఇన్ లేదా బోర్డింగ్ సమయంలో అందజేయాల్సి ఉంటుంది. ప్రయాణం చేయాలనుకునే వారు కనీసం మూడు రోజుల ముందు టికెట్లను కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ఆఫర్ ను పొందవచ్చు. ఎయిర్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Also Read: సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి సులభ మార్గాలివే..?

ఎయిర్ ఇండియా అందిస్తున్న ఈ ఆఫర్ వల్ల ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా విజృంభణ వల్ల విమానాల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గుతుండటంతో పలు కంపెనీలు ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.