జగన్ కు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

రాజకీయాల్లో ఏ కుర్చీ ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు పదవీ బాధ్యతలు చేపడుతుంటారు.. విరమణ పొందుతుంటారు. కానీ.. ముఖ్యంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడిని మాత్రం ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంటారు. ఏ నేత ఎలాంటి పథకాలను అమలు చేశారు..? ఏ నేత ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉంది..? ప్రజల బాగోగులు చూసుకుందెవరు..? అనే అంశాలు జీవితాంతం వినిపిస్తుంటాయి. ఎన్నో ఏళ్లుగా సీఎం సీటు కోసం ఆరాటపడిన జగన్‌కు ఏడాదిన్నర క్రితం ఆ ఛాన్స్‌ దొరికింది. […]

Written By: Srinivas, Updated On : December 17, 2020 10:09 am
Follow us on


రాజకీయాల్లో ఏ కుర్చీ ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు పదవీ బాధ్యతలు చేపడుతుంటారు.. విరమణ పొందుతుంటారు. కానీ.. ముఖ్యంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడిని మాత్రం ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంటారు. ఏ నేత ఎలాంటి పథకాలను అమలు చేశారు..? ఏ నేత ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉంది..? ప్రజల బాగోగులు చూసుకుందెవరు..? అనే అంశాలు జీవితాంతం వినిపిస్తుంటాయి. ఎన్నో ఏళ్లుగా సీఎం సీటు కోసం ఆరాటపడిన జగన్‌కు ఏడాదిన్నర క్రితం ఆ ఛాన్స్‌ దొరికింది. ముఖ్యమంత్రి బాధ్యతల చేపట్టిన నాటి నుంచే జగన్‌ పథకాలతో దూసుకెళ్తున్నారు. నెలకో కొత్త స్కీంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

Also Read: జమిలీ ఎన్నికలతో కేసీఆర్ చంద్రబాబులు ఔటేనా?

అంతేకాదు.. జగన్‌ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఉమ్మడి ఏపీలోనే కాదు, దేశంలోనే ఒక అరుదైన రికార్డ్ 2020లో నమోదు చేశారు. జగన్ ఈ ఏడాది మొత్తానికి ఏ ఒక్క నెలనూ వదలకుండా పదుల సంఖ్యలో పథకాలను అమలు చేసిన తీరుతో దేశంలోనే నంబర్ వన్ అనిపించుకున్నారు. ప్రపంచమంతా కరోనా ప్రభావంతో కకావికలం అయినా కరెన్సీ కదిలింది మాత్రం ఒక్క ఆంధ్రాలోనే. ఎంతటి కష్టకాలంలోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా కొనసాగించిన చరిత్రను జగన్ క్రియేట్ చేశారు.

ఈ ఏడాది జనవరిలో అమ్మ ఒడి పథకానికి రూపకల్పన చేశారు జగన్‌. అప్పటి నుంచి డిసెంబర్‌‌ వరకూ పథకాలు అలాగే కంటిన్యూ చేశారు. రైతు నేస్తం, కాపు నేస్తం, ఆరోగ్యశ్రీ అందరికీ వర్తింపచేయడం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రత్యేకంగా పధకాలు, విద్యార్ధులకు పధకాలు ఇలా ఎన్నో అమలు చేసి చూపించారు జగన్. ఇక డిసెంబర్ నెలలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలతో బ్రహ్మాండమైన ముగింపును జగన్ 2020కి ఇచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసి జగన్ శభాష్ అనిపించుకున్నారు.

Also Read: బీ రెడీ.. మోహరిస్తున్న జగన్..

అయితే.. 2020 సంవత్సరం మాత్రం ప్రపంచానికి కష్టాలను తెచ్చిపెట్టింది. కొన్ని నెలల పాటు దేశంలో లాక్‌డౌన్‌ అమలైంది. ఖజానాకు పైసా కూడా ఆదాయం రాలేదు. మరో వైపు కేంద్రం నుంచి ఆర్థిక సాయం పెద్దగా లేదు. విభజ‌న ఏపీలో ఆదాయ మార్గాలు అసలే లేవు. అయినా కూడా జగన్ కరోనా పీక్స్ లో ఉన్న వేళలో కూడా ఏ ఒక్క స్కీంని ఆపకుండా సంక్షేమ రథాన్ని కొనసాగించారు. అంతే కాదు, తాను ప్రకటించిన క్యాలండర్ ని కచ్చితంగా అమలు చేశారు. ధనిక రాష్ట్రాలు సైతం జనాలకు నగదు బదిలీ చేయలేకపోయాయి. కానీ.. జగన్‌ మాత్రం ఠంచనుగా పింఛన్లు ఇవ్వడమే కాదు.. స్కీంలతో జాతర చేశారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన చరిత్ర ఎవరికీ లేదు. ఇక దేశంలోనూ ఏపీలో ఉన్నన్ని పథకాలు మరే రాష్ట్రంలో లేవు. ఆ విధంగా జగన్ ఒకే ఒక్కడుగా రాజకీయాల్లో ఉంటారని అంటున్నారు. మరి అసలే కరువుతో అల్లాడుతున్న ఏపీకి.. ఇన్ని పథకాలు అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కాకుండా ఉంది. ఏదిఏమైనా ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలతో చేదోడుగా నిలుస్తున్నారనేది వాస్తవం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్