https://oktelugu.com/

ముగ్గురు మృతితో ఆగిన పెళ్లి

కాసేపట్లో ఆ ఇంట్లో పెళ్లి జరనుంది. అంతలోనే విషాధ చాయలు అలుముకున్నాయి. పెళ్లి కోసం తీసుకెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందడంతో వివాహ వేడుకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడా గ్రామంలో జరిగే ఓ వివాహ వేడుక కోసం తీసుకెళ్తున్న నీటి ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో చిన్న దేవడా గ్రామానికి చెందిన తుకారం, మద్నూర్ కు చెందిన శంకర్, బిచ్కుందకు చెందిన సాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 17, 2020 / 10:17 AM IST
    Follow us on

    కాసేపట్లో ఆ ఇంట్లో పెళ్లి జరనుంది. అంతలోనే విషాధ చాయలు అలుముకున్నాయి. పెళ్లి కోసం తీసుకెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందడంతో వివాహ వేడుకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడా గ్రామంలో జరిగే ఓ వివాహ వేడుక కోసం తీసుకెళ్తున్న నీటి ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో చిన్న దేవడా గ్రామానికి చెందిన తుకారం, మద్నూర్ కు చెందిన శంకర్, బిచ్కుందకు చెందిన సాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా బంధువుల మృతితో వివాహ వేడుకలో విషాదఛాయలు నెలకొనన్నాయి. దీంతో పెళ్లి పనులు ఆపేశారు.