https://oktelugu.com/

Aadhar Card: మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందా.. ఏం చేయాలంటే?

Aadhar Card: ప్రస్తుత కాలంలో ఎంతో ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డు ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన కార్డులలో ఆధార్ కార్డు ఒకటి. బ్యాంక్ సంబంధిత పనులు చేయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే మన ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా సులభంగా లాక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ను లాక్ చేసుకోవాలని అనుకుంటే మొదట […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 17, 2021 / 11:35 AM IST
    Follow us on

    Aadhar Card: ప్రస్తుత కాలంలో ఎంతో ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డు ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన కార్డులలో ఆధార్ కార్డు ఒకటి. బ్యాంక్ సంబంధిత పనులు చేయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే మన ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా సులభంగా లాక్ చేసుకోవచ్చు.

    ఆధార్ కార్డ్ ను లాక్ చేసుకోవాలని అనుకుంటే మొదట యూఐడీఏఐ పోర్టల్ ను విజిట్ చేయాలి. ఆ తర్వాత https://resident.uidai.gov.in/ వెబ్ సైట్ ను విజిట్ చేసి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేయడం ద్వారా ఆధార్ కార్డ్ ను లాక్ చేసుకోవచ్చు. మై ఆధార్ ట్యాబ్ లో ఆధార్ సర్వీసెస్ ఆనే ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా ఆధార్ ను లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి.

    లాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే డాటా లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ లాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే డేటా అన్ లాక్ అవుతుంది. ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకూడదని భావించే వాళ్లు ఈ విధంగా చేస్తే మంచిది. ఆధార్ కార్డును గతంలో ఎక్కడెక్కడ వినియోగించుకున్నారో కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు లాక్, అన్ లాక్ ఫీచర్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    ఆధార్ కార్డు దుర్వినియోగం అయితే మాత్రం మనం నష్టపోయే అవకాశాలు ఉంటాయి. యూఐడీఏఐ ఆధార్ కార్డు ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం.