UPI Transactions: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24.85 లక్షల కోట్లు.. అదేం చిన్న అమౌంట్ కాదు. ఇండియా ముఖచిత్రాన్ని మార్చేసే అమౌంట్. ఒక రకంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని దేశాల బడ్జెట్ కంటే మించిన అమౌంట్. ఆ స్థాయిలో నగదును భారతీయులు ఉపయోగించారు. ఒకరకంగా చెప్పాలంటే వివిధ ఖర్చులకు వినియోగించారు. తాగే చాయ్ నుంచి మొదలుపెడితే.. వెలిగించే దీపాల వరకు ప్రతి లావాదేవీని అంతర్జాలంలోనే కొనసాగించారు. తద్వారా యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆగస్టులో అద్భుతమైన నగదు బదిలీలు జరిగాయని పేర్కొంది.
Also Read: అసలు ఎవరు ఈ ఒమీ..ఓజాస్ గంభీర కంటే పవర్ ఫుల్ నా..? బ్యాక్ స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
డిజిటల్ విధానంలో నగదు చెల్లింపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు భారతీయులు సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు డిజిటల్ లావాదేవీలు నగరాలకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు అవి మారుమూల గ్రామాలకు కూడా చేరుకున్నాయి. కూరగాయల కొనుగోలు నుంచి మొదలు పెడితే దుస్తుల విక్రయం వరకు ప్రతి విభాగంలోనూ డిజిటల్ విధానంలోనే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. అందువల్లే ఈ ఏడాది ఆగస్టు నెలలో యూపీఐ ద్వారా రికార్డు స్థాయిలో రెండు వేలకోట్ల నగదు బదిలీలు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన నివేదిక ప్రకారం గత ఏడాది ఆగస్టు నెలతో పోల్చి చూస్తే డిజిటల్ లావాదేవీలు 34 శాతం ఎక్కువగా జరిగాయి.గత నెల మొత్తం 20+ లక్షల కోట్ల విలువైన లావాదేవీలు చోటుచేసుకున్నాయి. సకటన రోజుకు 64.5 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. జూలై నెలలో 1947 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. వీటి ద్వారా 25.08 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి.
ఆర్థిక అక్షరాస్యత పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయులు పూర్తిగా నగదు చెల్లింపులకు డిజిటల్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. మారుమూల గ్రామాలలో కూడా డిజిటల్ లావాదేవీల మీద అవగాహన రావడంతో ప్రజలు చెల్లింపులను మొత్తం అంతర్జాలంలోనే కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మోసాలకు గురవుతున్నప్పటికీ.. ప్రభుత్వాలు, పోలీసులు కల్పిస్తున్న అవగాహన వల్ల ప్రజలు సురక్షితమైన చెల్లింపులు చేపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోనే డిజిటల్ విధానంలో చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్లే యూపీఐ ద్వారా రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ నెలలో మరింత ఎక్కువ స్థాయిలో డిజిటల్ లాభాలు జరుగుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. ఇక నవరాత్రి ఉత్సవాలు జరిగే అక్టోబర్ నెలలో ఈ లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయని పేర్కొంటున్నది.