Tanuku: డబ్బు అవసరాలను తీర్చడం మాత్రమే కాదు అనుబంధాలను కూడా విచ్చిన్నం చేస్తుంది. మనుషులకు మనుషులకు మధ్య దూరాన్ని పెంచుతుంది. కలహాలను పెరిగేలా చేస్తుంది.. అవసరమైతే ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తుంది. డబ్బు మంచిదే.. మనుషులే పాపిష్టి వాళ్లు. డబ్బులను చూసుకొని ఆయన వాళ్లను దూరం పెడతారు. డబ్బున్న పొగరుతో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా డబ్బు వల్ల చోటు చేసుకున్న దారుణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చదవబోయే కథనం కూడా అటువంటిదే.
Also Read: అసలు ఎవరు ఈ ఒమీ..ఓజాస్ గంభీర కంటే పవర్ ఫుల్ నా..? బ్యాక్ స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు
అతని పేరు తాడిశెట్టి నాగ త్రినాథ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తణుకు మండలం వేల్పేరు గ్రామం.. 2018లో ఉపాధి నిమిత్తం అతడు సింగపూర్ వెళ్ళాడు. అక్కడ జరిగిన ప్రమాదం అతడికి కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది.. త్రినాధ్ కు తండ్రి నాగేశ్వరరావు, సోదరుడు నాగశ్రీను, తమ్ముడు నాగరాజు కిరణ్ అన్నారు.. త్రినాధ్ సింగపూర్ లో ఓ సంస్థలో పనిచేస్తున్నప్పుడు అతడి తల్లి చనిపోయారు. కొడుకుగా ఇండియాకు వచ్చి తన తల్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఆ తర్వాత మళ్లీ సింగపూర్ వెళ్లిపోయాడు. అక్కడ వస్తున్న వేతనంలో కొంత తన ఖర్చులకు ఉంచుకొని.. మిగతా నగదు 60,000 తన తండ్రి, తమ్ముడి ఖాతాలో వేసేవాడు. 2024 జూలైలో తన సొంత ఊరికి వచ్చాడు. ఆ సమయంలో త్రినాథ్ సోదరుడు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ముందు తనకే పెళ్లి చేయాలని త్రినాథ్ తండ్రి ముందు ప్రతిపాదన ఉంచాడు.. ఇక ఇదే క్రమంలో గతంలో త్రినాథ్ పనిచేస్తున్న సంస్థ మళ్ళీ అతనికి ఉద్యోగం ఇచ్చింది. ఇది ఇలా జరుగుతుండగానే గత ఏడాది డిసెంబర్ 31న తన ద్విచక్ర వాహనం నుంచి త్రినాథ్ కింద పడిపోయాడు. నడువ భాగంలో తీవ్రంగా గాయమైంది. వెన్నుపూస దెబ్బ తినడంతో రెండు కాళ్లు స్పర్శ లేకుండా పోయాయి.
ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేకపోవడంతో.. ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. విశాఖపట్నంలో ఓ మెడికల్ కాలేజీలో చేరాడు. ఇప్పటివరకు అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆరు లక్షల వరకు ఖర్చయింది. తన వద్ద 4,00,000 ఉండడంతో.. వాటిని తన ట్రీట్మెంట్ కోసం ఉపయోగించాడు త్రినాధ్. ఇంకా రెండు లక్షలు కావాల్సి ఉంది. ఆ డబ్బుల కోసం సోమవారం ఉదయం సొంత ఊరికి వెళ్ళిపోయాడు. అతడు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా తండ్రి, సోదరులు వారించారు. దీంతో అతడు సాయంత్రం వరకు ఇంటి ఎదుట ఉండి పోవాల్సి వచ్చింది. వీల్ చైర్ లోనే ఎటు కదలకుండా ఉండాల్సిన దారుణం ఎదురయింది. “సింగపూర్ లో ఉన్నప్పుడు నేను డబ్బులు సంపాదించాను. అదంతా కూడా నా తండ్రి, సోదరుడి ఖాతాలోనే వేశాను. ఇప్పుడు నా వైద్యం కోసం డబ్బులు ఇవ్వడం లేదు. కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు. సొంత కుటుంబ సభ్యులే ఇలా చేస్తే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. నేను డబ్బు సంపాదించినప్పుడు నన్ను గౌరవంగా చూశారు. నాకు ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఇప్పుడు ఇలా చూస్తున్నారు. డబ్బుంటేనే ఈ లోకంలో విలువ ఉంటుంది. అది లేని నాడు సొంత కుటుంబ సభ్యులు కూడా బయటికి గెంటేస్తారని” త్రినాథ్ కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. త్రినాధ్ ఆస్థాయిలో గాయపడినప్పటికీ కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్లలేదట. తను ఎలాగైనా బతకాలని ఆశతో త్రినాథ్ ఉన్న డబ్బులు మతం ఖర్చుపెట్టి వైద్యం చేయించుకున్నాడు. అతడు ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చూసేందుకు వెళ్లలేదంటే వారు ఎంతటి రాతి మనుషులో అర్థం చేసుకోవచ్చు.