OG Movie Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునేలా చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఇంతకుముందు హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆశించిన మేరకు సక్సెస్ ని మాత్రం సాధించలేకపోయాడు. ఇక దాంతో ఓజి సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమాని చాలా ప్రస్టేజీయస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఈ సినిమా కోసం ప్రత్యేకించి డేట్స్ ని కేటాయించి మరి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు సుజీత్ సైతం ఈ సినిమాని ఒక విజువల్ వండర్ గానే కాకుండా పవన్ కళ్యాణ్ లో ఉన్న స్టార్ డమ్ ని సైతం పూర్తి స్థాయిలో బయటికి తీసి చూపించబోతున్నట్టుగా తెలుఅయింది.
Also Read: అసలు ఎవరు ఈ ఒమీ..ఓజాస్ గంభీర కంటే పవర్ ఫుల్ నా..? బ్యాక్ స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
అయితే ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతుందా? లేదా అనే ప్రశ్న మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి ఈ సినిమాకి 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టే సత్తా అయితే ఉందని సినిమా యూనిట్ తో పాటు చాలామంది జనాలు సైతం పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.
ఒక్కసారి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను ఈజీగా వసూలు చేయగలుగుతుంది అంటూ చాలామంది ఈ సినిమా మీద కామెంట్లు చేస్తున్నారు.
సెప్టెంబర్ 25వ తేదీ వస్తేగానీ ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని దాని మీద ఒక క్లారిటీ అయితే రాదు… సుజీత్ ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాల్సి ఉంది…