Royal Enfield Bullet 350: Royal Enfield.. తరాలుగా బైక్ వినియోగదారులను అలరిస్తున్న ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చి అలరిస్తోంది. బలమైన ఇంజన్ తో పాటు ఆకర్షనీయమైన డిజైన్ తో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసే బైక్ అంటే Royal Enfield గురించే చెబుతారు. అయితే ఈ కంపెనీ లేటెస్ట్ గా హైబ్రిడ్ ఇంజన్ తో మార్కెట్లోకి రాబోతుంది. అలాగే ఇందులో ABS టెక్నాలజీతోపాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే విధంగా తయారు చేశారు. మరి ఈ బైక్ పూర్తి వివరాలు లోకి వెళ్తే..
ఇప్పటివరకు వచ్చిన Royal Enfield వాహనాల్లో ఎక్కువ శాతం పెట్రోల్ వ్యవస్థ ఉండేది. అలాగే Electric బైక్స్ కూడా వచ్చాయి. ఇవి వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. కానీ ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కంపెనీకి చెందిన వాహనం రాబోతుంది. Royal Enfield 350CC ఇంజన్లో ఇప్పుడు పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ అసిస్టెంట్ మోటార్ని కూడా ఉపయోగించాలని చూస్తున్నారు. ఈ రెండు ఇంజన్లు ఉండడంవల్ల తక్కువ వేగంతో నగరాల్లో ప్రయాణించేటప్పుడు ఇందన వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. బైక్ ప్రారంభం అయినప్పుడు లేదా క్రూజింగ్ సమయంలో ఎలక్ట్రిక్ సపోర్ట్ తో సున్నితమైన డ్రైవింగ్ ఉండటంతో పాటు మెరుగైన మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు వచ్చిన మోడల్స్ తో పోలిస్తే ఈ బైక్ లో వైబ్రేషన్ తగ్గే అవకాశం ఉంది. నగరాల్లో ట్రాఫిక్ కు అనుగుణంగా ప్రయాణించవచ్చు. హైవేలపై ఒకే విధంగా డ్రైవింగ్ తో వెళ్లొచ్చు.
అయితే రెండు ఇంజన్లు కలిగే ఈ బైక్ లో మైలేజ్ కూడా అద్భుతమైన పనితీరు కలిగించే అవకాశం ఉంది. Royal Enfield పెట్రోల్ బైక్ 350 సిసి మోటార్ సైకిల్ తో పోలిస్తే కొత్త హైబ్రిడ్ వెహికిల్ 66 kmpl ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఈ మైలేజ్ రోజువారి ప్రయాణాలు చేసే వారికి.. దూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇతర ఖర్చులు తగ్గడంతో పాటు.. మెయింటెనెన్స్ చార్జెస్ కూడా తగ్గుతాయి.
అలాగే ఇందులో ABS టెక్నాలజీని అమర్చారు. ఇది ఎలాంటి రోడ్డులోనైనా స్మూత్ డ్రైవింగ్ చేస్తుంది. మెరుగైన బ్రేకింగ్ నియంత్రణ ఉండడంతో వైబ్రేషన్ కూడా ఉండదు. ఇందులో డ్యూయల్ ABS పనిచేస్తుంది. ఇక Royal Enfield బైక్స్ అంటే ఆకట్టుకునే డిజైన్ విషయంలో కొత్తదనాన్ని తీసుకొస్తుంది. అలాగే హైబ్రిడ్ బైక్ కూడా సాంప్రదాయ స్టైలింగ్ కు అనుగుణంగా ఉంటుంది రౌండ్ హెడ్ లాంప్, మెటల్ ఫినిషింగ్ ఆకర్షిస్తాయి. డిజిటల్ అన్లాక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హైబ్రిడ్ సిస్టం ఇండికేటర్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ సౌకర్యవంతంగా ఉంటుంది. నేటి తరం యువకులకు అనుగుణంగా.. తక్కువ మైలేజ్ తో ప్రయాణం చేయాలని అనుకునే వారికి ఈ బైక్ అనుగుణంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు