కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన డీఏ బకాయిలను జూలై నుంచి చెల్లించనుండగా ఉద్యోగుల వేతనాలు సైతం భారీగా పెరగనున్నాయి. అయితే డీఏ నిలుపుదల చేయడం వల్ల ఉద్యోగులు ఏకంగా 3 లక్షల రూపాయలు నష్టపోనున్నారు.
ఉద్యోగాలకు 2020 సంవత్సరంలో డీఏ పెంపు లేదనే సంగతి తెలిసిందే. 2020 జనవరి 1న, 2020 జూలై 1న, 2021 జనవరి 1న కేంద్రం నిలుపుదల చేయడం వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు 3 ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ అందలేదు. గడిచిన 18 నెలలుగా ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ పెంపు జరగలేదనే సంగతి తెలిసిందే. ఈ విధంగా జరగడం వల్ల 10 వేల బ్రాకెట్‌లో గ్రేడ్ శాలరీ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా రూ.2.88 లక్షల వరకు నష్టపోయారని తెలుస్తోంది.
వీరికి డీఏ 2020 జనవరి 1 నుంచి జూన్ వరకు రూ.34608 నుంచి రూ.52368కు పెరగనుండగా 2021 జనవరి నుంచి జూన్ చివరి వరకు మళ్లీ డీఏ రూ.95172 నుంచి రూ.144012 పెరగాల్సి ఉంది. ఈ విధంగా ఉద్యోగులు సంవత్సరంన్నర కాలంలో ఏకంగా దాదాపు 3 లక్షల రూపాయలు నష్టపోవడం గమనార్హం. జూలై నుంచి ఉద్యోగులకు 28 శాతం డీఏ లభించనుండగా ప్రస్తుతం డీఏ 17 శాతంగా ఉంది.
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగులు భారీ మొత్తంలో నష్టపోనున్నారు. కేంద్రం నిర్ణయం ఉద్యోగులపై పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు.