రైతులకు శుభవార్త.. ఈ పంటతో రూ.లక్షల్లో లాభం..?

రైతులలో చాలామంది రైతులు ఒకే రకం పంటను సాగు చేస్తూ ఉంటారు. ఒకే రకం పంటలను తరచూ వేయడం వల్ల ఎక్కువ మొత్తంలో లాభం పొందడం సాధ్యం కాదు. రైతులు అంతర పంటలను పండించడం ద్వారా కూడా పంట తెగుళ్ల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక రైతు కొత్తరకం పంటను సాగు చేయడం ద్వారా కళ్లు చెదిరేలా లాభాలను సంపాదించుకుంటున్నారు. జెరేనియం సాగు చేయడం ద్వారా రైతు ఊహించని స్థాయిలో లాభాలను సొంతం […]

Written By: Navya, Updated On : June 6, 2021 8:36 am
Follow us on

రైతులలో చాలామంది రైతులు ఒకే రకం పంటను సాగు చేస్తూ ఉంటారు. ఒకే రకం పంటలను తరచూ వేయడం వల్ల ఎక్కువ మొత్తంలో లాభం పొందడం సాధ్యం కాదు. రైతులు అంతర పంటలను పండించడం ద్వారా కూడా పంట తెగుళ్ల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక రైతు కొత్తరకం పంటను సాగు చేయడం ద్వారా కళ్లు చెదిరేలా లాభాలను సంపాదించుకుంటున్నారు.

జెరేనియం సాగు చేయడం ద్వారా రైతు ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. జెరేనియం మొక్కల పూల నుంచి తీసిన నూనె ధర ఏకంగా లీటరు రూ.12 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. ఫర్‌ఫ్యూమ్, అరోమాథెరపీ, సౌందర్య సాధనాలు, పరిమళ ద్రవ్యాలు, సుగంధ సబ్బుల తయారీలో ఈ నూనెను వినియోగిస్తారు. జెరీనియం మెడిసినల్ ప్లాంట్ కూడా కావడంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

జెరీనియం అల్జీమర్స్, నాడీ క్షీణత, ఇతర రుగ్మతలకు చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది. మొటిమలు, తామర, ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో జెరీనియం ఎంతగానో సహాయపడుతుంది. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడంలో జెరీనియం తోడ్పడుతుంది. జెరీనియం సహాయంతో మరికొన్ని ఔషధాలను తయారు చేస్తారు. రైతులు ఈ పంటను పొలాల్లో వేస్తే మంచి లాభాలను పొందవచ్చు.

ఇప్పటివరకు ఈ పంటను సాగు చేయని వాళ్లు ఈ పంటను సాగు చేస్తే మంచి లాబాలను సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో నష్టాల బారిన పడకుండా భారీ లాభాలను సులభంగా పొందవచ్చు.