అపోలో ఫార్మసీలో 100 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కరోనా విజృంభిస్తున్న తరుణంలో వరుస జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఏపీలోని అపోలో ఫార్మసీలలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని సమాచారం. అపోలో ఫార్మసీ ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఉద్యోగాలను భర్తీ చేయనుందని సమాచారం. ఈ ఉద్యోగాలలో . ఫార్మసిస్ట్ విభాగంలో 50, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో మరో 50 ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన […]

Written By: Navya, Updated On : June 6, 2021 8:31 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కరోనా విజృంభిస్తున్న తరుణంలో వరుస జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఏపీలోని అపోలో ఫార్మసీలలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని సమాచారం. అపోలో ఫార్మసీ ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఉద్యోగాలను భర్తీ చేయనుందని సమాచారం. ఈ ఉద్యోగాలలో . ఫార్మసిస్ట్ విభాగంలో 50, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో మరో 50 ఖాళీల భర్తీ జరగనుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.9420 నుంచి రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఫార్మాసిస్ట్‌ ఉద్యోగ ఖాళీలు 50 ఉండగా బీ.ఫార్మసీ, ఎం-ఫార్మసీ, డీ-ఫార్మసీ ఉత్తీర్ణులైన వాళ్లకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.10,500 నుంచి రూ. 15 వేల వరకు వేతనంతో పాటు నెలకు రూ.1000 నుంచి రూ.3 వేల వరకు అలవెన్సులు లభిస్తాయి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, లీవ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్, అవార్డులు, రివార్డులు, ఇక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఇతర బెనిఫిట్లు పొందవచ్చు. 19 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైల్‌ ట్రైనీ అసోసియేట్‌ విభాగంలో 50 ఖాళీలు ఉండగా టెన్త్, ఇంటర్ తో పాటు ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్టర్ చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రెజ్యుమె, ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాతో పాటు 4 ఫొటోలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు తిరుపతి, చిత్తూరు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. అధికారక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.