7-Seater Car Price Cut
7-Seater Car Price Cut: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కూడా వాహనాల ధరలు పెరిగాయి.ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 1 నుంచి పలు కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో మహీంద్రా తన XUV700 ధరను భారీగా తగ్గించనుంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు రూ.75 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే, మహీంద్రా ఈ కారుతో పాటు మిగిలిన అన్ని మోడళ్ల ధరలను మూడు శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Also Read : రూ.6 లక్షలకే వచ్చే ఈ 7 సీటర్ కారును కొనేందుకు ఎగబడుతున్నారు.. ఎందుకో తెలుసా?
మహీంద్రా XUV700 కొత్త ధర
మహీంద్రా ఈ కారులోని కొన్ని వేరియంట్ల ధరలను రూ.45వేలు… మరికొన్ని వేరియంట్ల ధరలను రూ.75 వేలు తగ్గించింది. ఈ కారు 6-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ రెండు లేఅవుట్‌ల ధరలను తగ్గించింది. మహీంద్రా XUV700.. AX7 AT 7-సీటర్ FWD, AX7 AT 6-సీటర్ , AX7 AT 7-సీటర్ AWD ధరలను రూ. 45 వేలు తగ్గించారు. దీనితో పాటు AX7 L అన్ని ఐదు ట్రిమ్‌ల ధరలను రూ. 75వేలు తగ్గించారు. అయితే, ఇటీవల విడుదలైన XUV700 ఎబోనీ ఎడిషన్ మాత్రం ఈ కార్ల ధరలు తగ్గే దాంట్లో లేదు.
తగ్గనున్న XUV700 పెట్రోల్ వేరియంట్ల ధరలు
మహీంద్రా XUV700 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ నాలుగు ట్రిమ్‌ల ధరలు మాత్రమే తగ్గించాయి. ఈ వాహనం AX7 ఆటోమేటిక్ 6, 7-సీటర్ వేరియంట్ల ధర రూ. 45 వేలు తగ్గింది. అలాగే ఈ వాహనం AX7 L ఆటోమేటిక్ 6, 7-సీటర్ వేరియంట్ల ధర రూ. 75 వేలు తగ్గింది. XUV700 టర్బో-పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రిమ్‌ల ధరలో ఎలాంటి మార్పు లేదు. దీని వలన ఈ కారు ప్రారంభ ధరలో ఎలాంటి మార్పు లేదు.
భారతీయ మార్కెట్‌లో కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్న కంపెనీల విషయానికి వస్తే మారుతి సుజుకి ఏప్రిల్ 2025 నుంచి తమ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ముడిసరుకు, నిర్వహణ ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణం. హ్యుందాయ్ కూడా తమ కార్ల ధరలను ఏప్రిల్ నుంచి 3 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది.టాటా మోటార్స్ కూడా ఏప్రిల్ 2025 నుండి తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఎంత శాతం పెంచుతుందో ఇంకా వెల్లడించలేదు. ముడిసరుకు ధరల పెరుగుదలే దీనికి కారణమని తెలుస్తోంది.
Also Read : అతి తక్కువ బడ్జెట్ లో లభించే 7 సీటర్ కార్లు ఇవే…
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 7 seater car price cut
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com