Homeబిజినెస్Tata Punch Micro EV: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 421 కి. మీ... ఏం కారో...

Tata Punch Micro EV: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 421 కి. మీ… ఏం కారో తెలుసా?

Tata Punch Micro EV: కారు కొనేటప్పుడు మైలేజ్ గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పెట్రోల్, డీజిల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాల పర్ఫామెన్స్ ఎక్కువగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్న మాట. ఒకసారి చార్జింగ్ చేస్తే వందల కిలోమీటర్ల వరకు మైలేజీ ఇచ్చే కార్లు ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో TATA కంపెనీకి చెందిన కారు ఒకటి ఏకంగా 421 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అంతేకాకుండా ఇందులో నేటి తరానికి అనుగుణంగా ఫీచర్లు ఉండడంతో కొత్త కారు కొనాలని అనుకునేవారు దీనిపై ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఈ నెలలోనే 20వ తేదీన మార్కెట్లోకి రాబోతున్న ఈ కారు గురించి పూర్తిగా తెలుసుకుందాం..

TATA కంపెనీ నుంచి SUV పంచ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది మైక్రో ఈవీ గా రాబోతుంది. ఇందులో ఎక్స్టీరియర్ డిజైన్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. కొత్తగా వచ్చే ఈ కారు ముందటి భాగంలో హెడ్ లాంప్స్ విభిన్నంగా కనిపిస్తాయి. సాధారణంగా లాంప్స్ కారు ముందటికి వచ్చి ఉంటాయి.. కానీ ఇవి లోపలికి ఉండి ప్రత్యేక లుక్ ను చూపిస్తుంది. అలాగే ప్రత్యేకంగా LED బార్ ఉండడంతో రాత్రి సమయంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొత్తగా ఈ కారుకు DRL డిజైన్ చేయడంతో ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. వెనుక వైపు ఉండే టెయిల్ లాంప్స్ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఈ కారు ఇన్నర్ ఫీచర్ విషయానికి వస్తే 12.3 అంగుళాల భారీ స్క్రీన్ ఉండబోతుంది. అలాగే ఇందులో వైర్లెస్ చార్జింగ్, వాయిస్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇప్పటి తరాన్ని ఆకర్షించేందుకు sunroof ను కూడా చేర్చారు. 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెవెల్ 2 ADAS సిస్టం ఉండడంతో ఈ కారులో ప్రయాణించే డ్రైవర్తోపాటు ప్రయాణికులకు సేఫ్టీని అందిస్తాయి. ఈ కారులో 25 kW బ్యాటరీ ప్యాకప్ చేర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అయితే 35 kW బ్యాటరీ చేర్చుకున్నట్లైతే 421 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. లాంగ్ జర్నీ ఎక్కువగా చేసే వారితోపాటు రోజువారి వినియోగం కోసం కారును ఉపయోగించే వారికి ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంధన ఖర్చుల నుంచి ఇది కాపాడుతుంది అని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈ కారు ధర రూ.9.99 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 14.44 లక్షల ధర వరకు అందుబాటులో తీసుకురానున్నారు. టాటా కంపెనీకి చెందిన వెహికిల్స్ అంటే ప్రత్యేకమైన అభిమానం చాలామందికి ఉంది. ఇలాంటి వారి కోసం ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు.

 

S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.