Homeఎంటర్టైన్మెంట్Lavanya Tripathi warning video: మా మామయ్య జోలికి వస్తే అసలు ఊరుకోను అంటూ లావణ్య...

Lavanya Tripathi warning video: మా మామయ్య జోలికి వస్తే అసలు ఊరుకోను అంటూ లావణ్య త్రిపాఠి వార్నింగ్..వీడియో వైరల్!

Lavanya Tripathi warning video: ‘అందాల రాక్షసి’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి(Lavanya Tripati), చూస్తూ ఉండగానే ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా, కేవలం తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. ఇక రీసెంట్ గానే మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె, ఒక మగబిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాల్లో నటిస్తుందా లేదా అనే అనుమానం ఉండేది. కానీ పెళ్లి అయిన కొద్దీ నెలలకే ఈమె ‘సతీ లీలావతి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. దేవ్ మోహన్ ఈ చిత్రం లో హీరో గా నటిస్తుండగా, తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆనంది ఆర్ట్స్ మరియు దుర్గాదేవి పిక్చర్స్ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 6వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ ని మొదలు పెట్టారు. ఈ ప్రొమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లావణ్య త్రిపాఠి పాల్గొన్నది. ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు లావణ్య త్రిపాఠి సమాధానం చెప్తూ ‘నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే, నేను అసలు ఊరుకోను. చిరంజీవి గారు మా కుటుంబం లో స్త్రీలను ఎంత గౌరవిస్తారో మాకు తెలుసు. విమర్శలు చేసేవాళ్లకు ఆయన గురించి అసలు ఏమి తెలియదు. ఆయన లాగా స్త్రీలను గౌరవించే వ్యక్తిని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఆయన చేసే గొప్ప పనుల్లో ఒక్క శాతం కూడా చెయ్యలేని వాళ్ళు, నేడు ఆయన్ని విమర్శించే రేంజ్ కి వచ్చేశారు’ అంటూ లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టడం, ఒక అబ్బాయి పుట్టడం తో గతంలో చిరంజీవి బ్రహ్మానందం కొడుకు మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ ‘మా ఇల్లు లేడీస్ హాస్టల్ లాగా మారిపోయింది, మా లేజసీ ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఒక కొడుకు కావాలి, ఈసారైనా చూడు చరణ్ అనే వాడిని’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చింది వీడియో ని బాగా వైరల్ చేసి సోషల్ మీడియా లోని నెటిజెన్స్ కొంతమంది ట్రోల్స్ చేశారు. వీటి అన్నిటికి కలిపి లావణ్య త్రిపాఠి చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు.

 

Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
[td_block_15 category_id="_related_tag" custom_title="Related News" ajax_pagination="next_prev" limit="3"]
[td_block_21 custom_title="Most Popular" category_id="_current_cat" review_source="" time_ago_add_txt="" sort="" f_header_font_weight="" f_header_font_transform=""]