https://oktelugu.com/

kajal: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కాజల్​ భర్త!

kajal: ఫిల్మ్​ ఇండస్ట్రీలో వారసత్వం ఎప్పటినుంచో కొనసాగుతోంది. టాలీవుడ్​, బాలీవుడ్​ ఏదైనా సరే.. ఈ మార్క్ మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటి ఎంట్రీలను చాలానే చూశాం. అయితే, తాజాగా, స్టార్​ హీరోయిన్ల భర్తలు కూడా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కాజల్​ భర్త గౌతమ్​ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఫిల్మ్​ ఇండస్ట్రీలో టాక్​ నడుస్తోంది. కాజల్​- కిచ్లు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. వీరిద్దరూ ప్రేమించి ఇటీవల విహారం చేసుకున్న సంగతి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 10:40 am
    Follow us on

    kajal: ఫిల్మ్​ ఇండస్ట్రీలో వారసత్వం ఎప్పటినుంచో కొనసాగుతోంది. టాలీవుడ్​, బాలీవుడ్​ ఏదైనా సరే.. ఈ మార్క్ మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటి ఎంట్రీలను చాలానే చూశాం. అయితే, తాజాగా, స్టార్​ హీరోయిన్ల భర్తలు కూడా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కాజల్​ భర్త గౌతమ్​ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఫిల్మ్​ ఇండస్ట్రీలో టాక్​ నడుస్తోంది. కాజల్​- కిచ్లు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. వీరిద్దరూ ప్రేమించి ఇటీవల విహారం చేసుకున్న సంగతి తెలిసిందే.

    kajal

    మరోవైపు, కాజల్​ గర్భవతి అయినట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే కాజల్ తన భర్తను కడా సీనీ పరిశ్రమకు పరిచయం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తన వద్దకు వచ్చిన  దర్శకులకు తన భర్తకు తాను నటించే సినిమాల్లో చిన్న పాత్రనైనా ఇప్పించేలా ప్రయత్నిస్తోందట. ఇప్పటికే వీరిద్దరూ తమ బిజినెస్​ పరంగా ఓ షూట్​లో పాల్గొన్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గౌతమ్​కి కూడా సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది.

    ఈ వార్తలు నిజమైతే.. కాజల్​ తన భర్తను ముందుండి ఫిల్మ్​ ఇండస్ట్రీలో నడిపించడంలో ఎటువంటి తప్పులేదని పలువురు భావిస్తున్నారు. గౌతమ్​ కూడా చూడటానికి హీరోని తలపిస్తాడు. అయితే, గౌతమ్​ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ డైరెక్టర్​ ఎవరనేది ఆసక్తిగా మారింది.  కాగా, పెళ్లికి ముందు వరుస చిత్రాల్లో నటించిన కాజల్​.. వివాహం తర్వాత తనభర్తతో కలిసి ఎంజాయ్​ చేస్తోంది. త్వరలోనే మళ్లీ సినిమాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సైన్​ చేసింది ఈ ముద్దుగుమ్మ.