TVS Ronin 2022: గంటకు 120 కిలోమీటర్ల వేగం..అడ్వాన్స్ ఫీచర్లు.. అత్యధిక ధర.. హైబ్రిడ్ టెక్నాలజీతో నడిచే TVS రోనిన్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. TVS నుంచి వచ్చిన బైకుల్లో అత్యధిక ధర పలికింది రోనిన్ మాత్రమే. ఈ బైక్ రూ.1.49 లక్షల నుంచి రూ.1.68 లక్షల వరకు ఆయా మోడళ్లకు రేట్ ఫిక్స్ చేశారు. కొత్తగా వచ్చిన రోనిన్ మూడు మోడళ్లలో ఉంది. బేస్, బేస్ +, మిడ్ అనే మూడు రకాలున్నాయి. కొన్ని రోజులగా హోండా, హీరో, బజాజ్ లాంటి కంపెనీల నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో యూత్ ను ఆకర్షించే విధంగా TVS రోనిన్ ను తెచ్చింది. దీని ఫీచర్ తెలిసిన యువకులు ఫిదా అవుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉండడమే దీని ప్రత్యేకత. అయితే ఈ బైక్ ఫీచర్లేంటో ఒకసారి పరిశీలిద్దాం.
TVS రోనిన్ 2022 పేరుతో వచ్చిన న్యూ బైక్ కు ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ ఉంది. ఇప్పటి వరకు హెడ్ ల్యాంప్ నార్మల్ గానే ఉండేది. ఎక్సటర్నల్ గా మాత్రమే ఎల్ ఈడీని అటాచ్డ్ చేసుకునేవారు. కానీ రోనిన్ లో మాత్రం ఆటోమెటిక్ గా ఎల్ ఈడీ ఫిక్స్ అయి వస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీతో నడిచే బ్రేక్ లైట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. సాధారణంగా బ్రేక్ వేయగానే బ్యాక్ సైడ్ రెడ్ లైట్ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు హైబ్రీడ్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇక విస్తృత ఫ్రంట్ టైర్ కూడా సౌకర్యంగా ఉంటుంది. రోనిన్ బైక్ కు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీంతో వాహనదారుడికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఫ్రంట్ వైపు రెండు SHOWA అప్ సైడ్ డౌన్ ఫోర్క్ లు ఉన్నాయి. వెనుకవైపు ఒకే గ్యాస్ చార్డ్జ్ మోనో షాక్ ఉంది.
Also Read: Director Parasuram: మహేష్ కి సూపర్ హిట్ ఇచ్చినా కూడా ఆఫర్స్ దక్కించుకోలేకపోతున్న స్టార్ డైరెక్టర్
స్మార్ట్ ఎక్స్ నెక్ట్ తో సహా 28 కనెక్ట్ చేయబడిన ఫీచర్లతో డిజిటల్ స్పీడో మీటర్ రోనిన్ బైక్ లో అత్యాధునిక ఫీచర్ గా కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ బైక్ హ్యాండిల్ పై పెట్టుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మొబైల్ ను ఈ హ్యాండిల్ పై పెట్టుకున్నవారికి మొబైల్ నోటిఫికేషన్లు, కాల్ స్వీకరణ, తిరస్కరణ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే వాయిస్ అసిస్టెంట్, రైడ్ మోడ్ ను మార్చేందుకు వీలుగా ఉంది. ఈ సిస్టం సైడ్ స్టాండ్ వార్నింగ్ కూడా ఇస్తుంది. అలాగే టర్న్ సిగ్నల్స్ ను అలర్ట్ చేస్తుంది. ఫోన్ బ్యాటరీ తక్కువ అయినా కూడా అప్రమత్తం చేస్తుంది. తక్కువ ఫ్యూయల్ అలర్ట్ కలిగిన రైడ్ అసిస్ట్ ఫీచర్లు కూడా రోనిన్ లో కనిపిస్తాయి.
ఈ బైక్ లో సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 20 bhp, 7,750rpm గరిష్ట శక్తిని, 19.93Nm@3,750rpm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 120 కిలో మీటర్లు ఈ బైక్ పు వెళ్లే విధంగా సెట్ చేయబడింది. అసిస్ట్, స్లిప్ క్లచ్, పెద్ద ఆయిల్ కూలర్, 03C టెక్నాలజీ, సిలిండర్ పిన్ ఏరియా ఉన్నాయి. 3 బార్ 4,500 rpm వద్ద మిక్చర్ తయారీని మండించే ట్విన్ స్ప్రే ఇంజెక్షన్ ఈ బైక్ లో కనిపిస్తాయి.
Also Read: Chiranjeevi- Balakrishna: బాలయ్యకి పోటీగా మెగాస్టార్.. మరీ దీనిలో కూడా పోటీనా ?