Homeబిజినెస్Mukesh Ambani Investment In US Refinery Project: ఇండియాను కాదని అమెరికాలో అంబానీ పెట్టుబడులు.....

Mukesh Ambani Investment In US Refinery Project: ఇండియాను కాదని అమెరికాలో అంబానీ పెట్టుబడులు.. ఏంటి కథ?

Mukesh Ambani Investment In US Refinery Project: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. భారత్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భారత కుబేరుడు. అత్యంత సంపన్నుడు. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్‌ అనేక వ్యాపారాలు చేస్తోంది. ముఖ్యంగా ఆయిల్‌ రంగంలో రిలయన్స్‌ అగ్రస్థానంలో ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుని శుద్ధిచేసి వివిధ దేశాలకు విక్రయిస్తోంది. తాజాగా రిలయన్స్‌ మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టెక్సాస్‌లో ఏర్పాటు చేయబోయే 300 బిలియన్‌ డాలర్ల ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్టును రిలయన్స్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇది 50 ఏళ్ల తర్వాత అమెరికాలో ఏర్పాటు చేస్తున్న కొత్త రిఫైనరీ.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

ప్రాజెక్ట్‌ ముఖ్యాంశాలు
పోర్ట్‌ ఆఫ్‌ బ్రౌన్స్‌విల్‌లో ఇది ప్రపంచంలోనే ’క్లీనెస్ట్‌’ రిఫైనరీగా రూపొందుతుంది. అమెరికన్‌ షేల్‌ ఆయిల్‌ను ప్రాసెస్‌ చేసి డొమెస్టిక్‌ మార్కెట్లు, ఎగుమతులకు సరఫరా చేస్తుంది. వేలాది ఉద్యోగాలు, ఆర్థిక పునాది పెరుగుతాయి. ఈ డీల్‌ను ’అమెరికా ఫస్ట్‌’ విధానంతో ముడిపెట్టారు. పర్మిట్లు సులభం, పన్నులు తగ్గించి పెట్టుబడులు ఆకర్షించినట్లు పేర్కొన్నారు. ఎనర్జీ ఆధిపత్యం, జాతీయ భద్రత పెరిగినట్లు ప్రశంసించారు.

భారత్‌కు ప్రయోజనాలు
రిలయన్స్‌ పాలుపంచుకోవడంతో యూఎస్‌ మార్కెట్‌లో బలపడుతుంది. షేల్‌ ఆయిల్‌ టెక్నాలజీ, ఎక్స్‌పోర్ట్‌ అవకాశాలు పెరుగుతాయి. ఇరాన్‌ యుద్ధ సంక్షోభంలో భారత ఎనర్జీ సెక్యూరిటీకి దోహదపడుతుంది. ఈ భారీ పెట్టుబడి సౌత్‌ టెక్సాస్‌ ఆర్థికాన్ని మారుస్తుంది. భారత్‌– అమెరికా ఎనర్జీ సహకారం బలపడుతుంది. గ్లోబల్‌ ఆయిల్‌ కొరతలో యూఎస్‌ ఎగుమతులు పెరిగి ధరలు స్థిరపడతాయి.

ట్రంప్‌ ఈ ప్రకటన ఇరాన్‌ యుద్ధ నేపథ్యంలో చేశారు. అమెరికా ఆయిల్‌ స్వయం సమృద్ధి పెంచి గ్లోబల్‌ ఆధిపత్యం చెలాయించాలని లక్ష్యం. రిలయన్స్‌కు ట్రంప్‌ థాంక్స్‌ చెప్పడం భారత్‌తో డీల్స్‌కు సిగ్నల్‌. దీర్ఘకాలంలో రిలయన్స్, అమెరిఆకా ఎనర్జీ చైన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version